వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘనంగా మొదలైన మేడారం మినీ జాతర.. నాలుగురోజుల పాటు సాగే వన సంబరం!!

మేడారం మినీ జాతర నేటి నుండి ప్రారంభమైంది. నాలుగురోజుల పాటు జరగనున్న ఈ జాతరకు ఐదు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

గిరిజనుల ఆరాధ్య దైవాలుగా కొలుస్తున్న, దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రజలు విశేషంగా దర్శించే సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర కొండాకోనా పరవశించేలా ప్రారంభమైంది. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన, జాతీయస్థాయిలో గుర్తించబడిన మేడారం జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి చాలా ఘనంగా జరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుండి కోట్లాదిగా వచ్చే భక్తులతో మేడారం జన సంద్రాన్ని తలపిస్తుంది . ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర.. విగ్రహాలు లేని విశిష్టమైన సమ్మక్క సారలమ్మల జాతర చాలా ప్రశస్తమైనది. అటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర మండ మెలిగే పండుగతో నేటి నుంచి మొదలైంది.

రెండేళ్లకోసారి మహా జాతర ... ప్రస్తుతం జరుగుతుంది మేడారం మినీ జాతర

రెండేళ్లకోసారి మహా జాతర ... ప్రస్తుతం జరుగుతుంది మేడారం మినీ జాతర

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మల దర్శనానికి తరలివస్తున్నారు. రెండేళ్లకు ఒకసారిమహా జాతర జరగగా మహా జాతర జరగని సంవత్సరం మినీ మేడారం జాతర జరుగుతుంది.గతేడాది మేడారం మహా జాతరచాలా ఘనంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కోట్లాది మంది ప్రజలు అమ్మవార్లను దర్శించుకుని, మొక్కలు చెల్లించుకుని సంతోషంగా ఇళ్లకు వెళ్లారు. ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఒడిస్సా తదితర రాష్ట్రాల నుండి భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు మేడారం వస్తారు. వనమంతా జనసంద్రమైన వేళ అమ్మవార్లను గద్దెల మీదకు తీసుకు వస్తారు. భక్తులు పూనకాలతో ఊగిపోతారు. శివశక్తుల చిందులతో కోలాహలంగా అమ్మవార్ల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక మహా జాతర తర్వాత సంవత్సరం మినీ మేడారం జాతర జరుగుతుంది.

నేటి నుండే మేడారం మినీ జాతర.. పోటెత్తిన భక్తులు

నేటి నుండే మేడారం మినీ జాతర.. పోటెత్తిన భక్తులు

నేటి నుంచి మేడారం మినీ జాతర కొనసాగనుంది. ఇక మేడారం మినీ జాతర నేపథ్యంలో రెండు రోజుల నుండి భక్తులు మేడారానికి పోటెత్తారు. తలనీలాలు సమర్పించి, జంపన్న వాగుల పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవార్లకు బంగారాన్ని నివేదించి మొక్కలు చెల్లించుకుంటున్నారు. మేడారం చిన జాతరకు కూడా దాదాపు 5 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అధికారులు ఏర్పాటు చేశారు. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలతో మేడారం మినీ జాతర కూడా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

ఘనంగా ప్రారంభమైన మేడారం మినీ జాతర .. అధికారుల ఏర్పాట్లు

ఘనంగా ప్రారంభమైన మేడారం మినీ జాతర .. అధికారుల ఏర్పాట్లు

నేటి నుండి ప్రారంభమై మేడారం మినీ జాతర నాలుగు రోజుల పాటు ఈ నెల 4వ తేదీ వరకు కొనసాగనుంది. ములుగు, హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి నుంచి ప్రత్యేకంగా మేడారం మినీ జాతరకు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. జాతర సందర్భంగా ట్రాఫిక్‌ సమస్యలు తతెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మేడారం చిన్న జాతరకు కూడా లక్షలాదిగా భక్తులు తరలివస్తారని, అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

మేడారం మినీ జాతర ... జనసంద్రంగా మేడారం

మేడారం మినీ జాతర ... జనసంద్రంగా మేడారం


నేటి నుండి నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతర లో మండమెలిగే పండుగతో జాతరను ప్రారంభించి, సమ్మక్క సారలమ్మలకు పూజలు నిర్వహించి, భక్తులు మొక్కులు చెల్లింపు చేసి,అమ్మవార్లవన ప్రవేశంతోమేడారం మినీ జాతర ముగుస్తుంది.వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులతో మేడారం వనమంతా జనసంద్రంగా, సందడిగా మారుతుంది. నాలుగు రోజులపాటుభక్తులుగిరిజన ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునిబెల్లాన్ని బంగారంగా నివేదించిమొక్కులు చెల్లించుకుంటారు.అత్యంత శక్తివంతులుగా, గిరిజన అరాజ దైవాలను నమ్మే భక్తులు, మహా జాతరకు రాలేని భక్తులు, ఈ మినీ జాతరలో అమ్మవార్లను దర్శించుకుని తరిస్తారు.

English summary
Medaram mini jatara has started from today. Devotees reach Medaram and visit Sammakka Saralamma in medaram mini jatara which will be held for four days. More than five lakh devotees are expected to attend this year's mini jatara.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X