హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెగాస్టార్‌కు సోకిన కరోనా: ఇటీవలే కేసీఆర్‌తో భేటీ: నాగార్జునకూ: ఆచార్య షూటింగ్‌లో

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం తాను హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నానని తెలిపారు. చిరంజీవి తన కొత్త సినిమా ఆచార్య షూటింగ్‌లో రోజూ పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రొటోకాల్ ప్రకారం.. సినిమా షూటింగ్‌లో పాల్గొనే సమయంలో ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుంది.

Recommended Video

Chiranjeevi Tests Positive For COVID-19, Under Home Quarantine | Oneindia Telugu

ఇందులో భాగంగా ఆయన ఆచార్య షూటింగ్‌లో పాల్గొనడానికి వెళ్లిన సమయంలో కరోనా పరీక్షలను చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దీనితో ఆయన హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాలను చిరంజీవి వెల్లడించారు. తనలో కరోనా వైరస్ లక్షణాలేవీ కనిపించలేదని తెలిపారు. అసింప్టోమేటిక్‌గా రిపోర్ట్ వచ్చినట్టు చెప్పారు. తనను కలిసి వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని చిరంజీవి విజ్ఙప్తి చేశారు.

Megastar Chiranjeevi tests positive for Covid 19

నాలుగైదు రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలను చేయించుకోవాలని అన్నారు. ఇదిలావుండగా.. ఇటీవలే చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలిశారు. వరద బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి చెక్‌ను కేసీఆర్‌కు ఇచ్చారు. అదే సమయంలో మరో హీరో అక్కినేని నాగార్జున కూడా కేసీఆర్‌ను కలిశారు. ఫలితంగా- కేసీఆర్, నాగార్జునలకు కరోనా వైరస్ సోకుతుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వారిద్దరూ కరోనా నిర్ధారణ పరీక్షలనుచేయించుకోవాల్సిన అవసరం ఏర్పడినట్లు చెబుతున్నారు.

English summary
Tollywood Megastar and former Union Minister K Chiranjeevi tests Positive for Coronavirus. He released a statement and said that I am currently asymptomatic and quarantining myself at home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X