• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Chiranjeevi: మెగా కాంపౌండ్‌లో విడాకుల కలకలం: సమంత బాటలో చిరు చిన్న కూతురు?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విడాకుల పర్వం కొనసాగుతోందా? కొద్దిరోజుల కిందటే అక్కినేని నాగ చైతన్య-సమంత విడిపోయిన తరువాత మరో కుటుంబం అదే బాట పట్టనుందా? కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్య ధనుష్ అధికారికంగా విడాకులను ప్రకటించిన సమయంలోనే అలాంటి పరిణామమే టాలీవుడ్‌లోనూ చోటు చేసుకోబోతోందా? అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి అవుననే సమాధానమే వినిపిస్తోంది.

శ్రీజ కూడా..

శ్రీజ కూడా..

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ..తన సోషల్ మీడియా అకౌంట్లల్లో భర్త పేరును తొలగించిన నేపథ్యంలో- ఈ ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. శ్రీజ కూడా అక్కినేని నాగచైతన్య-శ్రీజ బాటలో నడిచే అవకాశాలు ఉన్నాయా? అంటూ ప్రముఖ జాతీయ వెబ్‌సైట్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియాటైమ్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. శ్రీజ తన పేరును మార్చుకోవడం పట్ల- భర్త కల్యాణ్‌దేవ్‌తో విడిపోయే ప్రయత్నాల్లో ఉన్నారంటూ చెప్పుకొచ్చింది.

కల్యాణ్‌దేవ్‌తో రెండో వివాహం..

కల్యాణ్‌దేవ్‌తో రెండో వివాహం..

శ్రీజకు ఇది రెండో వివాహం. శిరీష్ భరద్వాజ్‌తో విడిపోయిన తరువాత ఆమె కల్యాణ్‌దేవ్‌ను పెళ్లాడారు. శ్రీజ-కల్యాణ్‌దేవ్ వివాహం బెంగళూరు వైభవంగా జరిగింది. అంతా సవ్యంగా ఉందనుకుంటున్న దశలో ఇప్పుడు మళ్లీ విడాకుల కలకలం చెలరేగింది. కల్యాణ్‌దేవ్‌కు దూరంగా ఉంటున్నాననే సందేశాన్ని శ్రీజ చెప్పకనే చెప్పారు. తన సోషల్ మీడియా అకౌంట్‌లోని పేర్లల్లో కల్యాణ్‌దేవ్ పేరును తొలగించడంతో ఈ అనుమానాలు బలపడ్డాయి.

ఇన్‌స్టాలో పేరు మార్పు..

ఇన్‌స్టాలో పేరు మార్పు..

శ్రీజ.. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీజ కల్యాణ్ పేరుతో కొనసాగారు. ఇప్పుడు అందులో నుంచి కల్యాణ్ పేరును తొలగించారు. తన పుట్టింటి పేరును జత చేశారు. శ్రీజ కొణిదెలగా మార్చుకున్నారు. అక్కడితో ఆగలేదు. కొద్దిరోజులుగా ఆమె కల్యాణ్‌దేవ్‌కు సంబంధించిన ఎలాంటి ఫొటోలు గానీ, వీడియోలను గానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయలేదు. ఆయనను అన్‌ఫాలో చేశారు. గత ఏడాదే వారు విడిపోయారంటూ అభిప్రాయాలు సైతం వ్యక్తమౌతోన్నాయి.

శిరీష్‌తో ఆర్యసమాజ్‌లో పెళ్లి..

శిరీష్‌తో ఆర్యసమాజ్‌లో పెళ్లి..

శ్రీజ.. 2007లో శిరీష్ భ‌ర‌ద్వాజ్‌ను వివాహం చేసుకున్నారు. వారిది ప్రేమ వివాహం. పెద్దలను ఎదిరించి సికింద్రాబాద్ ఆర్య స‌మాజ్‌లో పెళ్లిపీటలు ఎక్కారు. అప్ప‌ట్లో ఈ పెళ్లి పెళ్లి ఉమ్మడి రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. శ్రీజ-శిరీష్ భరద్వాజ్‌‌కు ఓ కుమార్తె ఉంది. భేదాభిప్రాయాలు, మనస్పర్థలు తలెత్తడంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. 2016లో శ్రీజ.. క‌ళ్యాణ్ దేవ్‌‌ను వివాహం చేసుకున్నారు. బెంగళూరులో కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్‌గా వివాహం జరిగింది. ఓ పాపకు జన్మనిచ్చారీ దంపతులు.

కల్యాణ్‌దేవ్‌తో విభేదాలు

కల్యాణ్‌దేవ్‌తో విభేదాలు

అనంతరం కల్యాణ్‌దేవ్.. మెగాస్టార్ చిరంజీవి అల్లుడి హోదాలో.. హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి నటించిన సూపర్ హిట్ విజేత పేరునే తన అరంగేట్రం సినిమాకూ పెట్టుకున్నారు. తాజాగా ఆయన నటించిన సూపర్ మచ్చి సినిమా ఈ సంక్రాంతికి విడుదలైంది. కన్నడ నటి రచితా రామ్ ఇందులో హీరోయిన్. పులి వాసు దర్శకత్వం వహించిన సినిమా ఇది. రిజ్వాన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ మూవీ డివైడెడ్ టాక్‌ను తెచ్చుకుంది. కల్యాణ్‌దేవ్‌తో విభేదాలు వచ్చాయని, అందుకే దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.

English summary
Tollywood Megastar Chiranjeevi Konidela‘s younger daughter Sreeja Kalyan has dropped her husband's name Kalyan and replaced it with her father's surname Sreeja Konidela.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X