వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Rains: కొనసాగుతున్న అల్పపీడనం.. మరో మూడు రోజులు వానలే..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో వర్షం పడింది. ఉప్పల్, పీర్జాది గూడ, తార్నాక, రాజేంద్ర నగర్, మైలార్ దేవ్ పల్లి, అత్తాపూర్, బండ్లగూడ జాగీర్, కిస్మత్ పూర్, హిమాయత్ సాగర్, నార్సింగి, మణికొండ, పుపాల్ గూడ, గండిపేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

రోడ్లన్నీ జలమయం

రోడ్లన్నీ జలమయం

ఉప్పల్, పీర్జాదిగూడ, తార్నాక తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు భారీ వర్షంతో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలు చెరువులను తలపించాయి. అంబర్‌పేట, ముసారంబాగ్, మలక్‌పేటలోనూ భారీవర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. చంపాపేట్, ఐఎస్ సదన్, సంతోష్‌నగర్‌, సైదాబాద్, చాదర్‌ఘాట్‌, కోఠిలో వాన పడ్డది.దులకు గురవుతున్నారు.

ఇండ్లలోకి వరదనీరు

ఇండ్లలోకి వరదనీరు


కొద్దిపాటి వర్షానికే రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడం, ఇండ్లలోకి వరదనీరు వచ్చి చేరుతోందని లోతట్టు ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం చర్లపల్లి లో 4.2 సెంటీమీటర్లు, బండ్లగూడ రామంతపూర్ లో 4.1 సెంటీమీటర్లు, ఏఎస్ రావు నగర్ లో 3.9 సెంటీమీటర్లు, సరూర్ నగర్ లో 3.2 సెంటీమీటర్లు, హబ్సిగూడ లో 3 సెంటీమీటర్లు, ఎల్.బీ.నగర్ లో 2.8 సెంటీమీటర్లు, మెట్టుగూడలో 2.3 సెంటీమీటర్లు, చిలకనగర్ లో 1.8 సెంటీమీటర్లు, సీతాఫల్మండిలో 2.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

 ఉమ్మెంతాల్ లో 12 సెం.మీ.

ఉమ్మెంతాల్ లో 12 సెం.మీ.

వికారాబాద్ జిల్లా పెద్ద ఉమ్మెంతాల్ లో 12 సెం.మీ., వికారాబాద్ జిల్లా పరిగిలో 10.5 సెం.మీ., వికారాబాద్ లో 10సెం.మీ. వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా ధారురు మండలం నాగారం వద్ద వాగులో కారు నీటిలో కొట్టుకుపోయింది. కారు చెట్టుకు తట్టుకోవడంతో కారులో ఉన్నవారిని స్థానికులు రక్షించారు. కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

ఏపీలో కూడా

ఏపీలో కూడా


పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడన ప్రభావం వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. అటు ఏపీలో కూడా వర్షాలు కురిస్తున్నాయి. వచ్చే రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందట.

English summary
The Meteorological Department of Hyderabad said that there is a possibility of rains in Telangana for another three days. Amaravati Meteorological Department has said that there will be rains in AP as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X