అమీర్‌పేట్-ఎల్బీనగర్ మెట్రో లైన్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
హైదరాబాద్: నగరంలో రెండో దశ మెట్రో రైలు మార్గం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 12.15గంటలకు ఎల్పీనగర్-అమీర్‌పేట మెట్రో రైలు మార్గం ప్రారంభం కానుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ నర్సింహన్ హాజరై ప్రారంభించనున్నారు. సీఎస్ ఎస్కే జోషీ, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులతో కలిసి బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లిన మంత్రి కేటీఆర్.. గవర్నర్‌ను ఆహ్వానించారు.

కాగా, ఇప్పటికే నాగోల్-మియాపూర్ మధ్య మెట్రో రైలు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎల్బీనగర్-అమీర్‌పేట మార్గం కూడా అందుబాటులోకి వస్తే ప్రజలకు ప్రయాణం మరింత సౌకర్యంగా ఉండనుంది.