హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రో ఇక్కట్లు: అదే టిక్కెట్‌పై నేరుగా, తెలిసీ తెలియక..,ఫైన్ కడుతోన్న ప్రయాణికులు!

మెట్రో రైలులో త‌క్కువ దూరాలు వెళ్లేవారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణిస్తుండగా, నాగోల్ లేక ఉప్ప‌ల్ నుంచి నేరుగా మియాపూర్‌కు వెళ్లాల‌నుకున్న వారు మాత్రం తొలిరోజైన బుధవారం తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెట్రోరైలుకి హైదరాబాదీయుల నుంచి అనూహ్య స్పంద‌న వస్తోంది. త‌క్కువ దూరాలు వెళ్లేవారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణిస్తుండగా, నాగోల్ లేక ఉప్ప‌ల్ నుంచి నేరుగా మియాపూర్‌కు వెళ్లాల‌నుకున్న వారు మాత్రం తొలిరోజైన బుధవారం తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు.

Recommended Video

Hyd Metro smart card balance deducted automatically,Metro journey rules

నిజానికి నాగోల్ నుంచి నేరుగా మియాపూర్‌కు ఒకే మెట్రోరైలు వెళ్లదు. మియాపూర్‌కి వెళ్లాల‌నుకునే వారు నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు ఒక ట్రైన్‌లో వచ్చి, అక్కడ దిగి, మ‌రో మెట్రో రైలు ఎక్కి మియాపూర్ వెళ్లాల్సి ఉంటుంది.

hyd-metro-rail

నాగోల్ లేదా ఉప్పల్ స్టేషన్ లోనే నేరుగా మియాపూర్ కు టిక్కెట్ తీసుకున్నప్పటికీ ఇలాంటి ప్రయాణికులు అమీర్‌పేటలో దిగి దాన్ని మార్చుకోవలసి ఉంటుంది.

కొంత మంది ప్రయాణికులకు ఈ విషయం తెలియక.. అమీర్‌పేట్‌లో టికెట్ మార్చుకోకుండా మ‌రో ట్రైన్ ఎక్కేసి మియాపూర్‌లో దిగుతున్నారు. దీంతో వారు అక్కడ ఫైన్ కట్టాల్సి వస్తోంది.

స్మార్ట్ కార్డు ఉన్నవాళ్లు కూడా అమీర్‌పేటలో దిగిన తరువాత మ‌రో రైలు ఎక్కేటపుడు తమ స్మార్ట్ కార్డ్‌ను మరోసారి స్వైప్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో నాగోల్ నుంచి మియాపూర్ వరకూ ఒకే రైలు ఉంటుంద‌ని, మధ్యలో అమీర్ పేట్ ఇంటర్ ఛేంజ్ పాయింట్ అవ‌స‌రం అప్పుడు ఉండ‌బోద‌ని మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెబుతున్నారు.

ఈ విషయాలన్నింటిని టిక్కెట్ కౌంటర్ వద్ద ఎవరూ చెప్పట్లేదని, మొదటిసారి ప్రయాణించే వారికి ఇబ్బంది కలగకుండా మెట్రో సిబ్బంది చర్యలు తీసుకుంటే బావుంటుందని ప్రయాణికులు అంటుండగా, ఎక్కడికక్కడ అనౌన్స్‌మెంట్లు ఉన్నా సరే రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఆ గందరగోళ్లంలో వాటిని సరిగ్గా వినే పరిస్థిలో ప్రయాణికులు ఉండరని అధికారులు అంటున్నారు.

English summary
Due to lack of information about hyderabad metro rail.. some passengers are facing problems. The first day, Wednesday, many passengers travelled from Nagole to Miyapur with out changing their tickets. When they tried to go out from the Miyapur station, metro rail staff objected them and there passengers paid the prescribed fine for their affence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X