వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భవిష్యత్తులో శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలును విస్తరిస్తాం: కేటీఆర్

మెట్రో రైలు సౌకర్యాన్ని భవిష్యత్తులో శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరిస్తామని తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మెట్రోకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెట్రో రైలు సౌకర్యాన్ని భవిష్యత్తులో శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరిస్తామని తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మెట్రోకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు.

శనివారం హైదరాబాదులో కేటీఆర్ మాట్లాడుతూ రెండో దశ మెట్రో రైలు మార్గం విస్తరణలో భాగంగా మరో 80 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

minister-ktr

ఈ మధ్యే ప్రారంభమైన మెట్రో రైలు ప్రయాణానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోందని అన్నారు. ఇప్పటికే జరుగుతున్న మెట్రో పనులను యుద్ధప్రాతిపదిక పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.

శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు మార్గం విస్తరణ కార్యక్రమాన్ని చేపడతామని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. మెట్రో రైలులో జీహెచ్ఎంసీ ఉద్యోగులు ప్రయాణం చేసిన ఫోటోలను ఆయన ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు.

English summary
Minister KTR told that in future Metro Rail will reach Samshabad Airport. This will be taken as part of the Phase 2. While talking here in hyderabad on Saturday KTR expressed happyness regarding response for Metro Rail from the city people. He also posted the photos of GHMC employees who travelled in metro in his twitter account.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X