వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయదుర్గం వరకు మెట్రో... మూడు నిమిషాలకో రైలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో శుభవార్తను అందించింది. మెట్రో ఇప్పటి వరకు అయిదు నిమిషాలకు ఒక మెట్రో రైలు నడుస్తోంది. అయితే ఈ సమయాన్ని మరింత తగ్గించేందుకు మెట్రో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కారిడార్ 3లో నాగోల్ నుండి హైటెక్ సిటివరకు ప్రస్తుతం రైళ్లు నడుపుతున్నారు.

దీపావళీ నుండి రాయదుర్గం వరకు ఈ సర్వీసులను కొనసాగించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. కాగా డిశంబర్‌లో కారిడార్ -2లోని జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గాన్ని ప్రారంభిస్తామని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే...

Metro train services will be extended to Rayadurgam from Diwali

మూడు కారిడార్లలో రైళ్ల రాకపోకలు ప్రారంభమైతే ప్రయాణికుల సంఖ్య ప్రారంభమైన తర్వాత 5 లక్షల నుండి 10 లక్షలకు చేరుకొంటుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. మెట్రో ప్రారంభంలో 15 నిమిషాలకో రైలును నడిపిన మెట్రో ప్రస్తతం అయిదు నిమిషాలకు ఒక రైలును నడుపుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీతో మూడు నిమిషాలకు ఒక రైలును నడపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాట్టు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు..భవిష్యత్‌తో 90 సెకన్లకు ఒక రైలును నడిపె సామర్ధ్యం మెట్రోకు ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మూడు కారిడార్ల కోసం 56 రైళ్లు ఉండగా, 45 రైళ్లు మెట్రో కారిడార్-1, 3లలో 800 ట్రిప్పులు నడుస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి.

English summary
Metro train services will be extended to Rayadurgam from Diwali festival metro md nvs reddy siad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X