వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2019 ఎన్నికల్లో పోటీ చేయండి, రోహిత్ వేముల తల్లిని కోరిన జిగ్నేష్ మేవానీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో పోటీ చేసి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకీ గుణపాఠం నేర్పాలని గుజరాత్ ఎమ్మెల్యే, దళిత ఉద్యమ నేత జిగ్నేష్ మేవానీ రోహిత్ వేముల తల్లి రాధికకు సూచించారు. పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని జిగ్నేష్ మేవానీ రాధికను కోరారు.

రెండేళ్ళ క్రితం హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పిహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన ఆ సమయంలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సమయంలో పలు రాజకీయ పార్టీలు ఈ యూనివర్శిటీని సందర్శించాయి.

Mevani Urges Radhika Vemula to Fight 2019 Polls to 'Teach a Lesson to Manusmriti Irani'

హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల తల్లి రాధికను పోటీ చేయాలని జిగ్నేష్ కోరారు. దళిత పోరాటంలో మా అందరికీ ప్రేరణగా నిలుస్తున్న రాధికమ్మకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే. మీరు 2019 ఎన్నికల్లో పోటీ చేయాలి. తద్వారా పార్లమెంట్‌లో 'మను'స్మృతి ఇరానీకి గుణపాఠం నేర్పించాలి అని జిగ్నేష్‌ ఈ ఉదయం తన ట్విటర్‌లో ట్వీట్‌ చేశాడు.

దళితులనే లక్ష్యంగా చేసుకుని వ్యవహరించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీరుకు వ్యతిరేకంగా.. ఆమె పేరు ముందు మనుస్మృతిని చేర్చి అప్పట్లో పలువురు నేతలు విమర్శలు గుప్పించారు.

రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ సెంట్రల్‌యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్‌ రెండో వర్ధంతి నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన జిగ్నేష్‌ రాధికను కలిసి సంఘీభావం తెలిపాడు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాధిక పాల్గొంటారని.. బీజేపీ ఓటమినే తమ అంతిమ లక్ష్యమని జిగ్నేష్‌ ఈ సందర్భంలో వెల్లడించారు.

English summary
Gujarat MLA Jignesh Mevani appealed Rohit Vemula's mother Radhika to contest in 2019 elections.Mevani appealed to her on twitter on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X