హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ కు మరో కీర్తి కిరీటం - నగరంలో మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్ : ఐటీ రంగానికి కేరాఫ్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక సంస్థ రానుంది. ఇక్కడ భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్‌ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వం, మైక్రోసాఫ్ట్‌ మధ్య కొన్ని నెలల పాటు జరిగిన సంప్రదింపులు కొలిక్కి వచ్చాయి. శంషాబాద్‌ ప్రాంతంలో 50 ఎకరాల్లో డేటా సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి ఫిబ్రవరిలో అధికారికంగా సంయుక్త ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఐటీ రంగానికి మరింత మేలు చేసేలా

ఐటీ రంగానికి మరింత మేలు చేసేలా

మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌ ద్వారా తొలి విడతలో సుమారు 300 మంది నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు. డేటా సెంటర్‌ సామర్ధ్యం, విస్తీర్ణం తదితర పూర్తి వివరాలను వచ్చే నెలలోనే మైక్రోసాఫ్ట్‌ ప్రకటిస్తుంది. ఐటీ, ఫార్మా రంగాల్లో ఇప్పటికే సత్తా చాటుతున్న హైదరాబాద్‌ క్రమంగా ఆధునిక సాంకేతిక పెట్టుబడులకు కూడా గమ్యస్థానంగా మారుతోంది.

ఇప్పటికే క్లౌడ్‌ కంప్యూటింగ్, స్పేస్‌ టెక్నాలజీతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), బ్లాక్‌చెయిన్‌ వంటి ఆధునిక ఐటీ టెక్నాలజీతో పెట్టుబడులు వస్తున్నాయి. డేటా సెంటర్ల రంగంలో ఇప్పటికే ఏడు శాతం వాటా కలిగి ఉన్న తెలంగాణ, వచ్చే ఏడాది చివరి నాటి 9.5 శాతం వాటా సాధించే దిశగా అడుగులు వేస్తోంది.

ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు

ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు

ఇప్పటికే రాష్ట్రంలో ఫ్లిప్‌కార్ట్, కంట్రోల్‌ ఎస్, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ), ఎస్టీ టెలీమీడియా వంటి సంస్థలు ఇప్పటికే డేటా సెంటర్లను ఏర్పాటు చేశాయి. మరోవైపు హైదరాబాద్‌లో రూ.20,761 కోట్లతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) 2020 నవంబర్‌లో ప్రకటించింది.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అమెజాన్‌ డేటా సెంటర్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించే అవకాశముంది. మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు మరింత ఊపందుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ సానుకూల విధానాలు, ప్రోత్సాహకాలు, ఐటీ నిపుణుల లభ్యత, భౌగోళిక పరిస్థితులు హైదరాబాద్‌లో డేటా సెంటర్ల ఏర్పాటుకు అత్యంత అనుకూలంగా మారాయని తెలంగాణ ప్రభుత్వ ఐటీ అధికారులు చెబుతున్నారు.

Recommended Video

#ArrestBillGates Trends In India, బిల్ గేట్స్ పై ఇండియన్స్ ఆగ్రహం || Oneindia Telugu
వచ్చే నెలలో ఎంఓయూ...

వచ్చే నెలలో ఎంఓయూ...

మొబైల్‌ డేటా వినియోగం పెరుగుతున్న కొద్దీ వినియోగదారుల సమాచారాన్ని భద్ర పరచడంలో ఐటీ రంగంలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీ ప్రాధాన్యత పెరుగు తోంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో విని యోగదారుల సమాచారాన్ని భద్రపరిచేం దుకు భారీ ఎత్తున డేటా సెంటర్ల అవసరం పెరుగుతోంది. దీంతో ఈ సెంటర్ల నిర్మాణానికి ఐటీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి.

భారీ విస్తీర్ణంలో నిర్మించే డేటా సెంటర్ల నిర్మాణం, నిర్వహణ కూడా ప్రస్తుతం ఒక పెట్టుబడి, ఉద్యోగాల కల్పనకు అవకాశమున్న రంగంగా మారింది. ఐటీ కార్యకలాపాలు, వ్యాపార, వాణిజ్య కార్యకలా పాల నిర్వహణలో ఈ సెంటర్ల పాత్ర కీలకం అవుతోంది. ఇక, ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రావటం ద్వారా హైదరాబాద్ కు మరింతగా ఐటీ రంగంలో పెట్టుబడులు...వ్యాపార విస్తరణ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

English summary
Microsoft willing to invest rs 15 thousand cr for new data center in Hyderabad. In next month govt and Microsoft announce officially.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X