• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. జనం తిరగబడ్డారా..!

|

చొప్పదండి : టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు క్షేత్ర స్థాయిలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయా? కొన్ని విషయాల్లో జనం ఎదురు తిరుగుతున్నారా? ఇలాంటి ప్రశ్నలకు తాజాగా చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు ఎదురైన సంఘటన వాటికి సమాధానంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టుల నిర్మాణాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న క్రమంలో.. జనం కూడా ఎదురు తిరుగుతుండటం చర్చానీయాంశంగా మారింది. మిడ్ మానేరు ముంపు నిర్వాసితులు ఆయన్ని అడ్డుకోవడంతో కలకలం రేగింది.

ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను అడ్డుకున్న ముంపు నిర్వాసితులు

ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను అడ్డుకున్న ముంపు నిర్వాసితులు

మిడ్ మానేరు కిందకు వచ్చే బోయినపల్లి మండలంలోని మాన్వాడ శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ముంపు నిర్వాసితులు ఎమ్మెల్యేను అడ్డుకోవడంతో పరిస్థితి అదుపు తప్పినట్లైంది. కుదురుపాక, నీలోజిపల్లి గ్రామాలకు చెందిన మిడ్ మానేరు ముంపు నిర్వాసితులు ఎమ్మెల్యేను నిలదీశారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం కనిపించింది. సోమవారం నాడు జరిగిన ఈ ఘటన కాస్తా ఆలస్యంగా వెలుగుచూసింది.

వాహనం ముందుకు కదలకుండా బైఠాయింపు

వాహనం ముందుకు కదలకుండా బైఠాయింపు

రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఛాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మెల్యే వెళ్లారు. తొలుత శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్ట్ సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో మొక్కలు నాటారు. అక్కడినుంచి ఇతర ప్రాంతానికి వెళ్లే సమయంలో మార్గమధ్యంలో నిర్వాసితులు తనను అడ్డుకోబోతున్నారనే సమాచారంతో ఎమ్మెల్యే రూట్ మార్చారు. ఇతర మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆ విషయం కాస్తా నిర్వాసితులకు తెలియడంతో ఆయన ఎక్కడికైతే వెళ్లారో ఆ ప్రాంతానికి వెళ్లి నిరసన తెలిపారు. ఆయన వాహనం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు.

ఎమ్మెల్యే దిగొచ్చినా.. శాంతించని నిర్వాసితులు..!

ఎమ్మెల్యే దిగొచ్చినా.. శాంతించని నిర్వాసితులు..!

ఎమ్మెల్యే వెంట ఉన్న పోలీసులు నిర్వాసితులను అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు శాంతించలేదు. ఎమ్మెల్యేతో మాట్లాడతామంటూ మొండికేశారు. ఇక తప్పదనుకున్న ఎమ్మెల్యే ఎట్టకేలకు తన వాహనంలో నుంచి దిగి నిర్వాసితుల దగ్గరకు వచ్చారు. చివరకు వారికి న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చినా కూడా వారు అంగీకరించలేదు. మిడ్ మానేరు ముంపు నిర్వాసితులమైన తమకు న్యాయం చేయకుండా ఇంకెన్నాళ్లు పెండింగ్‌లో పెడతారంటూ నిలదీశారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.

హామీలు ఏమయ్యాయి.. పెండింగ్ సమస్యలకు మోక్షం ఎప్పుడు..!

హామీలు ఏమయ్యాయి.. పెండింగ్ సమస్యలకు మోక్షం ఎప్పుడు..!

ముంపు నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. 5 లక్షల 4 వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఎందుకు మంజూరు చేయలేదని అడిగారు. ఆ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు 18 ఏళ్లు నిండిన పెళ్లీడు యువతులకు 2 లక్షల రూపాయల ప్యాకేజీతో పాటు వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. పెండింగ్ సమస్యలు లేకుండా నిర్వాసితులకు తగిన విధంగా న్యాయం చేయాలని సూచించారు.

ఎన్నికల నాడు ఏం చెప్పారు.. ఇప్పుడేం జరుగుతోందంటూ ప్రశ్నల వర్షం

ఎన్నికల నాడు ఏం చెప్పారు.. ఇప్పుడేం జరుగుతోందంటూ ప్రశ్నల వర్షం

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ నిర్వాసితులకు బాసటగా నిలబడతానంటూ మాట ఇచ్చారుగా.. ఇప్పుడేం చేస్తున్నారని ఎమ్మెల్యేను నిలదీశారు. సీఎం కేసీఆర్‌ను బతిమిలాడైనా సరే తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తానన్నారు.. గెలిచి ఇన్ని నెలలవుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారానికి అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుందామని ఎమ్మెల్యే చెప్పినప్పటికీ ఆయన మాట ఎవరూ పట్టించుకోలేదు. అలాగే బైఠాయించడంతో చివరకు పోలీసులు జోక్యం చేసుకున్నారు. వారిని పక్కకు జరిపి ఎమ్మెల్యే వెళ్లేందుకు దారి ఇప్పించారు. మొత్తానికి ఎలాంటి ఘర్షణ జరగకపోవడంతో అటు పోలీసులు, ఇటు లీడర్లు ఊపిరి పీల్చుకున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Are TRS public representatives experiencing bad at the field level? Are people looking forward to some things? The latest incident to TRS MLA Sunke Ravi Shankar seems to be the answer to these questions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more