వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటింగ్ సిరాచుక్క మిడిల్ ఫింగర్‌‌కు చేరింది.. బూతులా మీనింగ్ మారింది.. నెట్టింట్లో కాంట్రవర్సీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ వరకే ఎన్నికలు జరుగుతున్నా.. మరికొన్ని ప్రాంతాల్లో ఇతరత్రా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికల మొదలు పరిషత్ ఎన్నికల వరకు ఓట్ల పండుగ సందడి అంతా ఇంతా కాదు. గత డిసెంబరులో ప్రారంభమైన ఎన్నికల హడావిడి.. అలా వరుసగా కొనసాగుతూనే ఉంది. అయితే పరిషత్ ఎన్నికల వేళ ఎడమచేతి చూపుడు వేలుకు వేసే సిరాచుక్కను మిడిల్ ఫింగర్‌కు వేస్తున్నారు. దాంతో మధ్యన వేలుకు పెట్టిన సిరాచుక్కతో కొందరు యువకులు సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం భిన్న రకాల కామెంట్లకు దారితీస్తోంది.

<strong>ఖబడ్దార్ కేసీఆర్.. మావోయిస్టుల పోస్టర్ల కలకలం.. పరిషత్ ఎన్నికల వేళ టెన్షన్ టెన్షన్</strong>ఖబడ్దార్ కేసీఆర్.. మావోయిస్టుల పోస్టర్ల కలకలం.. పరిషత్ ఎన్నికల వేళ టెన్షన్ టెన్షన్

మొన్ననే లోక్‌సభ ఎన్నికలు.. వెంటనే పరిషత్ ఎలక్షన్లు

మొన్ననే లోక్‌సభ ఎన్నికలు.. వెంటనే పరిషత్ ఎలక్షన్లు

తెలంగాణలో ఓట్ల పండుగ నడుస్తోంది. ఒక్కరోజో, రెండు రోజులో కాదు.. దాదాపుగా ఆర్నెళ్ల నుంచి అదే పరిస్థితి. గత డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దాని వెంటే జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అదలావుంటే ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. మళ్లీ వెంటనే పరిషత్ (జడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికలు తెరపైకి వచ్చాయి. అయితే లోక్‌సభ ఎన్నికలకు, పరిషత్ ఎన్నికలకు మధ్య వ్యవధి చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఓటర్ల ఎడమచేతి చూపుడువేలుకు పెట్టే సిరాచుక్కను మిడిల్ ఫింగర్‌‌కు పెట్టాలని జారీ చేసింది.

 ఎన్నికల సీజన్.. చెరిగిపోని గుర్తు

ఎన్నికల సీజన్.. చెరిగిపోని గుర్తు

సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా ఓటు వేశాక ఓటర్ల ఎడమచేతి చూపుడువేలుకు సిరాచుక్క పెట్టడం ఆనవాయితీ. ఒక్క ఓటర్ ఒకే ఓటు వేసే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఫాలో అవుతున్న నిబంధన ఇది. అలా ఓటర్లకు వేసిన సిరాచుక్క చాలారోజుల వరకు అలాగే ఉంటుంది. దాన్ని ఎలా చెరిపి వేయాలని చూసినా పోవడం కష్టమే. అయితే లోక్‌సభ ఎన్నికలు జరిగి నెల రోజులు కూడా కాలేదు. అప్పుడు ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల చేతి వేళ్లకు ఇంకా సిరాచుక్క అలాగే ఉండిపోయింది. దాంతో ఈసారి పరిషత్ ఎన్నికల్లో ఎడమచేతి మిడిల్ ఫింగర్‌‌కు సిరాచుక్క వేయాలని ఎన్నికల సంఘం అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసింది.

వేలు మారింది.. మీనింగ్ మారింది

వేలు మారింది.. మీనింగ్ మారింది

సిరాచుక్క వేలు మారడంతో సోషల్ మీడియాలో భిన్న రకాల కామెంట్లు వస్తున్నాయి. కొందరు ఓటు వేశాక సెల్ఫీలు దిగి ఫోటోలు పోస్టు చేస్తుండటంతో వారి ఫ్రెండ్స్ ఒక్కోరకంగా రియాక్ట్ అవుతున్నారు. ఎడమచేతి మిడిల్ ఫింగర్‌‌కు సిరాచుక్క (సెల్ఫీలో మాత్రం రైట్ హ్యాండ్ గా చూపిస్తుంది) ఉండటంతో రకరకాలుగా కామెంటుతున్నారు. అయితే మధ్యన వేలు చూపించడమనేది బూత్ మీనింగ్ అర్థం వచ్చేలా ఉండటంతో అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో కాంట్రావర్సీ టాపిక్ అవుతోంది.

ఇక ఓటు వేశామనే ఆనందంతో ఉన్న కొత్త ఓటర్లు తాము పెట్టిన సెల్ఫీ పోస్టులకు వస్తున్న కామెంట్లు చూసి కంగుతింటున్నారు. ఈ మిడిల్ ఫింగర్ తంటా ఏందిరా నాయనా అనుకుంటూ నిట్టూర్పు వదులుతున్నారు. ఇంకా కొంతమంది యువకులు మామా టెకీట్ ఈజీ అంటూ రిప్లై కూడా ఇస్తుండటం గమనార్హం. మొత్తానికి పరిషత్ ఎన్నికల వేళ మిడిల్ ఫింగర్ సిరాచుక్క అలా అలా బూత్ మీనింగుకు పరాకాష్టలా మారింది.

English summary
Middle Finger Voting Ink Controvorsy In Social Media. Series of Loksabha and Parishad elections, The Central Election Commission ordered to put the ink to left hand middle finger. After Voting some persons taken selfies and posted in social media. Their Friends commenting in different ways as that is volgur on middle finger ink.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X