తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు: పరుగులు తీసిన జనం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల భూమి కంపించింది. శనివారం మధ్యాహ్నం 2.03 గంటల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. రెక్టారు స్కేలుపై భూ ప్రకంపనలు తీవ్రత 4గా నమోదైంది.
కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మంచిర్యాలలోని రాంనగర్, గోసేవ మండల్ కాలనీ, నస్పూర్‌లో స్వల్పంగా భూమి కంపించింది. రామగుండంలోనూ భూమి కంపించింది.

దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. దాదాపు రెండు సెకన్లపాటు భూమి కంపించినట్లు తెలిసింది. కాగా, భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Comments
English summary
mild tremors felt in Mancherial and Peddapalli districts of Telangana.