వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐ ఫోన్ యాపిల్ ఛాలెంజ్.. ఆ లోపాలు చూపిస్తే 7 కోట్ల బహుమానం..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఐ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ కంపెనీ భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. ఏ రంగంలో కూడా ఇదివరకు ఎన్నడూ లేనంతగా, ఎవరూ ప్రకటించనంతగా పెద్దమొత్తంలో బహుమతి ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఐ ఫోన్లతో పాటు ఆ కంపెనీ తయారుచేసే కొన్ని ప్రొడక్ట్స్‌లో సైబర్‌ నేరాలు, హ్యాకింగ్‌కు ఛాన్స్ కల్పించే లోపాల్ని గుర్తించిన వారికి ఒక మిలియన్‌ డాలర్లను (ఇండియన్ కరెన్సీలో దాదాపు 7 కోట్ల రూపాయలు) బహుమానంగా అందించనున్నట్లు వెల్లడించింది. ఐ ఫోన్లు వాడుతున్న వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఆయా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు అపహరిస్తున్నాయని వివిధ వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ క్రమంలోనే యాపిల్ ఇంత పెద్దమొత్తంలో భారీ బహుమానం ప్రకటించినట్లు తెలుస్తోంది.

ఇంత పెద్దమొత్తంలో ప్రైజ్‌మనీ ప్రకటించిన యాపిల్ కంపెనీ కొన్ని కండిషన్లు కూడా పెట్టింది. వినియోగదారుడి నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా వారి ఫోన్లలోకి ప్రవేశించి.. లోపాలను కనుగొన్న వారికి మాత్రమే ఈ బహుమానమంటూ వెల్లడించింది. అయితే ఇదివరకు చిన్నపాటి బగ్స్‌ కనుగొన్నవారికి యాపిల్‌ కంపెనీ 20 వేల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు 14 లక్షల రూపాయలు) అందిస్తూ వచ్చింది. సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్న తరుణంలో యాపిల్‌ సంస్థ.. ముందు జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది.

 million dollars prize money Apple offers record bounty to researchers

విహార యాత్రకు వెళ్లారా మంత్రి గారు.. వరద బాధిత ప్రాంతాల్లో సెల్ఫీలా..! (వీడియో)

సంస్థ ప్రొడక్ట్స్‌లో లోపాల్ని పరిశోధించే ప్రక్రియలను సైతం ఈజీ చేస్తోంది యాపిల్ కంపెనీ. ఆ నేపథ్యంలో భద్రతా ప్రమాణాలు తొలగించిన ఐ ఫోన్లను పరిశోధకులకు అందిస్తోంది. దాంతో హ్యాకర్లకు అనుకూలించే లోపాలు పసిగట్టే అవకాశం ఏర్పడుతుందనేది ఒక అంచనా. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఆయా దేశాలు సరికొత్త టెక్నాలజీని సొంతం చేసుకుంటున్నాయి. అదే క్రమంలో యాపిల్ సంస్థ ఇలాంటి చర్యలు తీసుకుంటుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే ఇంత పెద్ద మొత్తం సొంతం కావాలంటే.. ఐఫోన్‌తో పాటు మ్యాక్ సాఫ్ట్‌వేర్‌, ఇతర యాపిల్‌ ఉత్పత్తుల్లో హ్యాకింగ్‌ అవకాశం కల్పించే లోపాల్ని కనుగొనాల్సి ఉంటుంది. ఆ మేరకు గురువారం లాస్‌వెగాస్‌లో జరిగిన బ్లాక్‌ హ్యాట్‌ సెక్యూరిటీ సదస్సులో భారీ మొత్తం ప్రైజ్‌మనీ యాపిల్‌ ప్రకటించింది.

English summary
Apple Inc is offering cyber security researchers up to $1 million to detect flaws in iPhones, the largest reward offered by a company to defend against hackers, at a time of rising concern about governments breaking into the mobile devices of dissidents, journalists and human rights advocates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X