వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఏఏ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో 4 న మిలియన్ మార్చ్ .. అదే సమయంలో ఓవైసీ కూడా భారీ ర్యాలీ

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్త నిరసనలు కొనసాగుతున్నాయి. సీఏఏ , ఎన్నార్సీకి వ్యతిరేకంగా పార్లమెంట్ వేదికగా వ్యతిరేకత తెలియజేసిన అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణా రాష్ట్రంలోనూ సభలు నిర్వహిస్తూ తమ నిరసన తెలియజేస్తున్నారు. ఈనెల నాలుగున హైదరాబాద్ వేదికగా నిర్వహించాలని భావిస్తున్న ర్యాలీలపై తెలంగాణలో చర్చ జరుగుతుంది.

Anti CAA WAR: ఢిల్లీ గేట్ దర్యాగంజ్ సమీపంలో హింసాకాండ .. 40 మంది అరెస్ట్ , 8మంది మైనర్లుAnti CAA WAR: ఢిల్లీ గేట్ దర్యాగంజ్ సమీపంలో హింసాకాండ .. 40 మంది అరెస్ట్ , 8మంది మైనర్లు

 4 న హైదరాబాద్ లో మిలియన్ మార్చ్

4 న హైదరాబాద్ లో మిలియన్ మార్చ్

ఇక ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో కూడా పలు దళిత విద్యార్ధి సంఘాలు, ప్రజా సంఘాలు, ముస్లిం సంఘాలు ఈ నెల 4 న హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తమ నిరసన తెలియజెయ్యటానికి మిలియన్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు .కానీ పోలీసుల అనుమతి కోసం వేచి చూస్తున్నారు. ఇక ఇదే రోజున ఓవైసీ కూడా భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించటంతో ఇప్పుడు తెలంగాణలో దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది.

సీఏఏ,ఎన్నార్సీకి వ్యతిరేకంగా పదిలక్షల మందితో ర్యాలీ

సీఏఏ,ఎన్నార్సీకి వ్యతిరేకంగా పదిలక్షల మందితో ర్యాలీ

సీఏఏ , ఎన్నార్సీకి వ్యతిరేకంగా సుమారు పది లక్షలమందితో డిసెంబరు 28 న మిలియన్ మార్చ్ జరపాలని భావించారు పలు సంఘాల నాయకుల జేఏసీ. పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులు అనుమతి నిరాకరించటంపై పోలీసుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్ విచారించిన హైకోర్టు మిలియన్ మార్చ్ కు అనుమతించే విషయాన్ని పునః పరిశీలించవలసిందిగా పోలీసులను ఆదేశించినట్టు తెలుస్తుంది .

 అసదుద్దీన్ ఓవైసీ తమ పార్టీ కూడా భారీ ర్యాలీ చేస్తుందని ప్రకటన

అసదుద్దీన్ ఓవైసీ తమ పార్టీ కూడా భారీ ర్యాలీ చేస్తుందని ప్రకటన

పలు సంఘాల జేఏసీ నిర్వహించ తలపెట్టిన ఈ భారీ ప్రదర్శనలో దళిత సంఘాలతో సహా విద్యార్ధిసంఘాలు, సామాజిక సంస్థలు, ముస్లిం సఘాలు , వివిధ జిల్లాల నుంచి ప్రజలు పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ ర్యాలీ అనుమతి కోసం వారు నిరీక్షిస్తున్నారు. ఇక ఇదే సమయంలో సీఏఎకు నిరసనగాఇప్పటికే నిజామాబాద్ వేదికగా సభ పెట్టిన ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు .

ర్యాలీల కోసం పోలీసుల అనుమతులు ..ఏం జరుగుతుందో

ర్యాలీల కోసం పోలీసుల అనుమతులు ..ఏం జరుగుతుందో

ఇందుకు నగర పోలీస్ కమీషనర్ అనుమతిని కోరుతున్న వారు ర్యాలీ రూట్ గురించి కూడా వివరించారు . చార్మినార్ నుంచి ధర్నా చౌక్ వరకు ఒక మార్గంలోనూ, దారుస్సలాం నుంచి ఈద్ గా బిలాలి వరకు మరో మార్గంలోనూ మార్చ్ నిర్వహిస్తామని చెప్తూనే మరో మార్గాన్ని కూడా తాము పోలీసులకు సూచించినట్టు తాము నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీ గురించి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈనెల 4 లేదా 5 తేదీల్లో భారీ ర్యాలీ నిర్వహించాలన్న ఆలోచనలో ఎంఐఎం కూడా ఉన్న నేపధ్యంలో మిలియన్ మార్చ్ ఎంఐఎం పార్టీ ర్యాలీ క్లాష్ అయ్యే వకాశం ఉంది. మరి వీరి ర్యాలీలకు పోలీసుల అనుమతి లభిస్తుందా ? అనేది వేచి చూడాలి .

English summary
Country-wide protests against the Citizenship Amendment Act continue. Asaduddin Owaisi, who has opposed the CAA and the NRC as a parliamentary forum, is also holding meetings in Telangana. another side muslim communities, dalit communities and public organisations planned to conduct million march on 4th. Telangana is going to discuss the rallies planned to be held in Hyderabad on the 4th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X