వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీవీకి భారతరత్న .. వ్యతిరేకించిన ఎంఐఎం .. కేసీఆర్ పై , ఎంఐఎంపై మండిపడిన సీతక్క

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ఆత్మగౌరవ పతాక అయిన భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా అధికార పార్టీకి సంబంధించిన సభ్యులతోపాటు ,విపక్ష కాంగ్రెస్ సభ్యులు ప్రసంగించి తీర్మానానికి మద్దతు ప్రకటించారు. పీవీ నరసింహారావు సేవలను కొనియాడారు. ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన పివి నరసింహారావుకు లభించాల్సిన గౌరవం దక్కలేదని వారు పేర్కొన్నారు.

పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతూ... తెలంగాణా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంపీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతూ... తెలంగాణా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

అయితే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని టిఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం వ్యతిరేకించింది. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన మజ్లిస్ పార్టీ సభ నుండి వాకౌట్ చేసింది. అయినప్పటికీ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్టుగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత సభను బుధవారానికి వాయిదా వేశారు.

 MIM opposed the resolution to give PV bharat ratna .. seethakka fire on MIM and KCR

ఎంఐఎం తీరుపై, శాసనసభను వాయిదా వేసి వెళ్లిపోవడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క సీఎం కేసీఆర్ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. నిజం నిప్పులాంటిది అన్నారు. పీవీ నరసింహారావు గారికి భారత రత్న ఇవ్వాలనే ప్రతిపాదన మీ మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీకి ఇష్టం లేదనా, సడన్ గా అసెంబ్లీని వాయిదా వేసి వెళ్లిపోయారు అంటూ సీతక్క మండిపడ్డారు.

స్వార్థ రాజకీయాల కోసం మహనీయుడి పేరు వాడుకుంటున్నారు అంటూ సీతక్క ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు మాజీ ప్రధానమంత్రి చేసిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో పి.వి.నరసింహారావు మరణిస్తే కనీసం వెళ్లి నివాళులు కూడా అర్పించలేదు అంటూ మండిపడ్డారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కు పీవీ గుర్తు వచ్చారని ,సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఏడు సంవత్సరాల తర్వాత పీవీ నరసింహారావు గుర్తు వచ్చారంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్ర రాజకీయాల్లో కొడుకును ముఖ్యమంత్రిని చేసి, దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు

English summary
TRS ally MIM opposed the resolution introduced by CM KCR. The Majlis party, which had declared its opposition to the decision to give Bharat Ratna to PV and walked out. However, Speaker Pocharam Srinivas Reddy said the resolution was unanimously approved by the House. The House then adjourned to Wednesday. MLA Sitakka fired saying that KCR is using PV's name for selfish politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X