వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కళామతల్లి ముద్దుబిడ్డ నేరెళ్ల వేణుమాధవ్‌: రసమయి

మిమిక్రీ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్‌ సత్కారమంటే యావత్‌ మిమిక్రీ కళాకారులకు చేసుకున్న అపూర్వ సత్కారమని సాంస్కృతిక సారథి చైర్మన్‌ కొనియాడారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: ధ్వన్యనుకరణ(మిమిక్రీ) సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్‌ 85వ ప్టుట్టిన రోజు వేడుకలు హన్మకొండలోని నేరెళ్ల వేణుమాధవ్‌ ప్రాంగణంలో ఆయన అభిమానుల సమక్షంలో బుధవారం రాత్రి నేత్రపర్వంగా జరిగాయి. ఆయన శిష్య గణం గురువును సత్కరించి తరించి పోయారు.

ఈ సందర్భంగా నేరేళ్ల వేణుమాధవ్‌ కల్చరల్‌ ట్రస్ట్‌ పక్షాన ప్రముఖ గాన కళాకారుడు కేఎస్‌ఆర్‌ బాలకృష్ణ శాస్త్రికి ట్రస్ట్‌ పక్షాన రూ. 10వేల నగదు దుశ్శాలువా, జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో ఘనంగా సత్కరించారు. రంగస్థల కళాకారుల ఐక్య వేదిక అధ్యకక్షుడు డాక్టర్‌ బండారు ఉమామహేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన ప్రతిభా పురస్కార వేడుకల్లో ముఖ్య అతిథిగా నగర పోలీస్‌ కమిషనర్‌ జి సుధార్‌బాబు పాల్గొన్నారు.

Nerella venumadhav

సాంస్కృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ.. వేణుమాధవ్‌ సత్కారమంటే యావత్‌ మిమిక్రీ కళాకారులకు చేసుకున్న అపూర్వ సత్కారమని ఆయన కొనియాడారు. ఆయన జన్మదినాన్ని ప్రభుత్వపరంగా చేసుకోవడం తమ అదృష్టమని పేర్కొన్నారు.

కళా ప్రపంపచానికి జరిగిన సత్కారమిది : ఎంపీ దయాకర్‌

వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ మాట్లాడుతూ.. కళల నగరమైన వరంగల్‌లో వేణుమాధవ్‌ జన్మించడం ద్వారా ఈ నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. వేణుమాధవ్‌కు అపూర్వ సత్కారం జరుగడం ఒక కళాకారుడిగా తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. వరంగల్‌కు కళారంగంలో గొప్ప పేరు గడించడం నేరేళ్ల వేణుమాధవ్‌ ద్వారానే అంటే అతిశయోక్తి కాదన్నారు. ఆకాశవాణి విశ్రాంత డిప్యూటీ డైర్టెర్‌ మంగళగిరి ఆదిత్య ప్రసాద్‌ విశిష్ట అతిథిగా హాజరై ప్రసంగిస్తూ తనకు వరంగ్‌ల్‌కు రావడం సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతోందని పేర్కొన్నారు.
వేణుమాధవ్‌ ఖ్యాతి విశ్వవ్యాప్తమని ఆయన ద్వారా అనేక మంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు.

కాగా, నేరేళ్ల వేణుమాధవ్‌ ట్రస్ట్‌ నివేదికను కార్యదర్శి హోదాలో అంపశయ్య నవీన్‌ సమర్పించారు. ఆయన మ్లాడుతూ.. ఈ వేదిక ద్వారా ఈ సారి మంగళంపల్లి బామురళీకృష్ణ ప్రియశిశ్యుడిగా పేరొందిన గాన కళానిధి కొండపల్లి సీతారామ బాలకృష్ణ శాస్త్రిని సత్కరించుకోవడం తమ ట్రస్ట్‌ అదృష్టమన్నారు.

నేరేళ్ళ శ్రీనాథ్‌, నేరేళ్ల రాధాకృష్ణతో పాటు సలహా మండలి సభ్యులు డాక్టర్ గిరిజా మనోహర్‌, వనం లక్ష్మికాంత్‌రావు, రామ చంద్రమౌళి, అత్తులూరి సత్యనారాయణ, వరిగొండ కాంతారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అలరించిన రామకోటి కచేరి..

వేణుమాధవ్‌ ప్రియశిష్యుడైన రామకోటి వైజాగ్‌ నుంచి వచ్చి ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఉదయం నుంచి నిర్వహించిన మిమిక్రీ పోటీల విజేతలకు ఎంపీ దయాకర్‌, రసమయి బాలకిషన్‌లు బహుమతులను ప్రదానం చేశారు. విజేతలుగా భరత్‌ ప్రథమ బహుమతిని, మధు ద్వితీయ, నీలకంఠ సత్యం తృతీయ బహుమతులను అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఆధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డితోపాటు అనేక మంది వేణుమాధవ్‌ను సత్కరించారు. పలువురు వేణుమాధవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఆసక్తే గెలుపునకు బాటలు వేసింది: వేణుమాధవ్‌

ఈ కార్యక్రమంలో నేరేళ్ల వేణుమాధవ్‌ మ్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనకు దురద (నేర్చుకోవాలనే ఆసక్తి) ఎక్కువని అందుకే మిమిక్రీ నేర్చుకున్నానన్నారు. తాను సినిమా నటుడిని అయి ఉంటే ఇప్పటికి తన జాబితాలో వంద సినిమాలు దాటేవని అలాంటి అవకాశాలు వచ్చినా కేవలం కళాకారునిగానే ఉండాలన్న అభిమతంతో తన జీవితాన్ని మిమిక్రీ కళకు అంకితం చేసినట్లు పేర్కొన్నారు. తన కళ తనతోనే అంతరించిపోకుండా 12 సంత్సరాల క్రితం ప్రత్యేక కోర్సును రూపొందించి రమణాచారి ద్వారా తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రవేశ కోర్సులు నిర్వహింపజేస్తున్నట్లు చెప్పారు. వరంగల్‌లో పుట్టడమే తన అదృష్టమన్నారు.

English summary
World famous mimicry artist Nerella Venu Madhav has entered into his 85th year of his life, marking which grand celebrations were held here on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X