వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బఫూన్ పిలిస్తే వెళ్లాలా?.. నోరు అదుపులో పెట్టుకో.. కేటీఆర్ Vs వీహెచ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల తప్పిదాలు అధికార, విపక్షాల మధ్య దుమారం రేపుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల మంటలు రేపుతున్నాయి. ప్రభుత్వం బాధ్యత వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ అంటుంటే.. ఆ పార్టీ లీడర్లు మతిభ్రమించి మాట్లాడుతున్నారని గులాబీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. అదలావుంటే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్సెస్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం చర్చానీయాంశంగా మారింది.

<strong>వింత పెళ్లి పత్రికలు.. పుచ్చకాయలే వెడ్డింగ్ ఇన్విటేషన్లు</strong>వింత పెళ్లి పత్రికలు.. పుచ్చకాయలే వెడ్డింగ్ ఇన్విటేషన్లు

టీఆర్ఎస్ ప్రభుత్వంపై విపక్షాల దాడి

టీఆర్ఎస్ ప్రభుత్వంపై విపక్షాల దాడి

ఇంటర్ ఫలితాల వెల్లడిలో దొర్లిన తప్పిదాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ప్రభుత్వానికి తలనొప్పిలా మారింది. అటు విద్యార్థి సంఘాలు సైతం వ్యతిరేక గళం అందుకోవడంతో టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది.

ఇలాంటి నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు మరింత వేడి పుట్టిస్తున్నాయి. మంగళవారం నాడు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు గుప్పిస్తే.. వెనువెంటనే టీఆర్ఎస్ నేతలు కౌంటర్ దాడికి దిగారు. ఇక కేటీఆర్ వర్సెస్ వీహెచ్ తీరుగా సాగుతున్న మాటల మంటలు ఇప్పట్లో చల్లారేటట్లు కనిపించడం లేదు.

బఫూన్ పిలిస్తే వెళ్లాలా..?

బఫూన్ పిలిస్తే వెళ్లాలా..?

ప్రతిపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఇంటర్మీడియట్ ఫలితాల తప్పిదాలను పట్టుకుని రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇంటర్ బోర్డు ఇచ్చిన టెండర్లతో తనకు సంబంధమేంటని ధ్వజమెత్తారు.
గ్లోబరీనా సంస్థకు 4 కోట్ల రూపాయలకు టెండర్‌ కట్టబెడితే.. 10వేల కోట్ల రూపాయల స్కామ్‌గా అభివర్ణించడం సరికాదన్నారు.

ఇక పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేయాలంటూ.. ఓ బఫూన్ పిలిస్తే తాను ఎలా వెళ్తానంటూ ఫైరయ్యారు. దొంగ అని ఆరోపిస్తూ నిజాయితీని నిరూపించుకొమ్మంటే ఎలా అని ప్రశ్నించారు. అసత్య ఆరోపణలు చేస్తూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ లీడర్లపై పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు.

 నన్నే బఫూన్ అంటావా?.. పద్దతిగా మాట్లాడటం నేర్చుకో..!

నన్నే బఫూన్ అంటావా?.. పద్దతిగా మాట్లాడటం నేర్చుకో..!

కేటీఆర్ వ్యాఖ్యలపై వీహెచ్ స్పందించారు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. మాట్లాడే భాష మార్చుకోవాలని సూచించారు. కేటీఆర్ అహంకార పూరిత ధోరణి మంచిది కాదని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది తానేనని.. అలాంటిది నన్నే బఫూన్ అంటావా అని ఫైరయ్యారు. ఒకవేళ గ్లోబరీనా సంస్థతో కేటీఆర్ బామ్మర్ధికి సంబంధం లేకుంటే.. తాను విసిరిన సవాల్ ప్రకారం పెద్దమ్మ గుడికి ఆయన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఎవరు బఫూనో.. ఎవరేంటనేది సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ ధ్వజమెత్తారు.

English summary
Inter Results Mistakes made a big fight in between trs and opposition parties. congress senior leader v hanmanth rao made huge allegations on ktr. Mean while ktr also fired on VH and commented as he is buffoon. Again VH commented on ktr to prove himself there is no connection with globarena company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X