• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇక బ‌స్టాండ్ల‌లో మినీ థియేట‌ర్లు..! ప్రయాణికులను ఆకర్షించే యత్నంలో టీఎస్ఆర్టీసీ..!!

|

హైదరాబాద్‌ : ఆర్టీసి బ‌స్ స్టాండ్ లు ఆధునిక‌త‌ను సంత‌రించుకోబోతున్నాయి. ప్రయాణికులకు వినోదం, ఆహ్లాదం అందించడంతోపాటు టికెటేతర ఆదాయం పెంచుకునే దిశగా టీఎస్‌ ఆర్టీసీ వేగంగా అడుగులు వేస్తోంది. ఆకర్షణీయ ప్రాంగణాలు నిర్మించి అధునాతన సేవలు అందించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణ ప్రాంగణాల్లో మినీ థియేటర్లు, బడ్జెట్‌ హోటళ్లు, వ్యాపార సముదాయాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రయాణికులను ఆకర్షించి ఆదాయం పెంచుకునేలా కసరత్తు చేస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలో ఉన్న ఎనిమిది ప్రయాణ ప్రాంగణాల్లో ఆయా సదుపాయాల కల్పనకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌, లో ఏర్పాటుకు కసరత్తు..! స‌క్పెస్ ఐతే మ‌రికొన్ని చోట్ల‌..!!

ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌, లో ఏర్పాటుకు కసరత్తు..! స‌క్పెస్ ఐతే మ‌రికొన్ని చోట్ల‌..!!

ఆర్టీసీలో నష్టాలు తగ్గించుకోవడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రావాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇటీవల జరిగిన స మీక్షా సమావేశంలో సూచించిన నేపథ్యంలో ఆ దిశగా అధికారులు చర్య లు ప్రారంభించారు. ఇందులో భాగం గా బస్టాండ్ల ఆధునీకీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే 9.5 కోట్ల రూపాయ‌ల‌తో ఎంజీబీఎ్‌సను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. నిత్యం 1.5 లక్షల మందికిపైగా రాకపోకలు కొనసాగిం చే ఎంజీబీఎస్ లో ఆధునిక సౌకర్యా లు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, ప్రయాణికులు సేద తీరేందుకు ఏసీ రెస్ట్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. 2 కోట్ల రూపాయ‌ల‌తో జూబ్లీ బస్టాండ్‌ను మోడ్రన్‌గా తీర్చిదిద్దారు. ఇదే తరహాలో నగరంలోని లోకల్‌, జిల్లా బస్సులు రాకపోకలు సాగించే బస్టాండ్లకూ ఆధునిక హంగులు అద్దనున్నారు.

 దుకాణ సముదాయాల ఏర్పాట్లు..! టికెటేత‌ర ఆద‌యం పై అదికారుల ద్రుష్టి..!!

దుకాణ సముదాయాల ఏర్పాట్లు..! టికెటేత‌ర ఆద‌యం పై అదికారుల ద్రుష్టి..!!

గ్రేటర్‌ పరిధిలో ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, పాటు ఎనిమిది ప్రయాణ ప్రాంగణాలున్నాయి. వీటి నుంచి రోజు లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో ప్రయాణ ప్రాంగణాలను మోడ్రన్‌గా తీర్చిదిద్దాలని ఆర్టీసీ భావిస్తోంది. రెండంతస్తుల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంగణాల్లో మినీ థియేటర్లు, దుకాణ సముదాయాలు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను అధికారుల బృందం త్వరలో పరిశీలించనుంది. ప్రయాణ ప్రాంగణాల్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌ను కొంత ప్రయాణికుల కోసం, మరికొంత స్థలాన్ని దుకాణాలకు కేటాయించారు. మొదటి అంతస్తులో ఎక్కువగా షాపులున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి అంతస్తును వినోదం, ఆహ్లాదానికి వేదికగా మారిస్తే ప్రయోజనమని అధికారులు భావిస్తున్నారు.

మినీ థియేట‌ర్లు..! పరిశీలించనున్న అధికారుల బృందం..!!

మినీ థియేట‌ర్లు..! పరిశీలించనున్న అధికారుల బృందం..!!

టీఎస్‌ ఆర్టీసీ టికెటేతర ఆదాయం సమకూర్చుకునే దిశ గా వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆర్థికం గా బలోపేతం అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 72 ప్రధాన బస్డాండ్లలో మినీ థియేటర్ల నిర్మాణం, బడ్జెట్‌ హోటల్స్‌ ఏర్పాటుకు బస్‌స్టేషన్లు అనువుగా ఉన్నాయా..? అనే అంశాలపై ఆర్‌ అండ్‌ డీ, జేఎన్‌టీయూ, నేషనల్‌ వర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అధికారుల బృందం పరిశీలించనుంది. 15 ఖాళీ స్థలాల్లో మినీ థియేటర్ల నిర్మాణానికి చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఇప్పటికే ముందుకొచ్చింది.

 గ్రేటర్‌లో మినీ థియేటర్లు, హోటళ్లు ఏర్పాటు చేసే ప్రాంతాలు..! ఆధునిక హంగులతో బస్టాండ్లు..!!

గ్రేటర్‌లో మినీ థియేటర్లు, హోటళ్లు ఏర్పాటు చేసే ప్రాంతాలు..! ఆధునిక హంగులతో బస్టాండ్లు..!!

ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్ ఖాళీ స్థ‌లాలను గుర్తించారు. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి. బోడుప్పల్‌,
మెట్టుగూడ, కరీంనగర్‌, కామారెడ్డి, భద్రాచలం, హన్మకొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, పెద్దపల్లి, ఆసిఫాబాద్‌, దేవరకొండ. ఆధునిక హంగులతో బస్టాండ్లు తీర్చిదిద్దడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు ఆర్టీసి అదికారులు. బస్టాండ్లు ఆధునీకరించడంతో పాటు వాణిజ్య ఆదాయాన్ని పెంచుకునే అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నామ‌ని. ఇప్పటికే ప్రాథమికంగా స్థలాలు గుర్తించామ‌ని, మినీ థియేటర్లు నిర్మించే అవకాశం లేని బస్టాండ్లలో హోటల్స్‌ ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలిస్తున్నామ‌ని. రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్లలో ఏసీ హోటల్స్‌ కూడా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు పరిశీలిస్తున్నట్టు అదికారులు చెప్పుకొస్తున్నారు.

English summary
RTC bus stands are going to be modern. The TSRTC is fast moving towards increasing passenger entertainment and ticket less revenue. RTC officials are taking steps to build attractive campuses and provide advanced services. Plans for mini theaters, budget hotels and business complexes are being created for travel camps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X