వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారు తొడ కోసుకుంటే..మేము మెడ కోసుకోం : కార్మికులే దూరమయ్యారు..మా పని మేం చేస్తున్నాం: పువ్వాడ..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఆర్టీసీ సమ్మె పైన ప్రభుత్వం తన వైఖరి మరోసారి తేల్చి చెప్పింది. కేబినెట్ అభ్యర్దించినా..కార్మిక సంఘాలు వినకుండా సమ్మెలోకి వెళ్లిందని మంత్రి పువ్వాడ అజయ్ సీరియస్ అయ్యారు. చర్చల నుండి వెళ్లిపోయిందని కార్మిక సంఘాలేనని చెప్పుకొచ్చారు. తాము ఏనాడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పలేదని స్పష్టం చేసారు. ప్రభుత్వం చేసిన హెచ్చిరకలను బేఖాతర్ చేసిన కార్మిక సంఘాలు ..వారే విధుల నుండి పారిపోయారని వ్యాఖ్యానించారు.

 మంత్రి పువ్వాడ అజయ్ ఉద్యమకారుడా! దమ్ముంటే నన్ను డిస్మిస్ చెయ్యండన్నఅశ్వద్ధామరెడ్డి మంత్రి పువ్వాడ అజయ్ ఉద్యమకారుడా! దమ్ముంటే నన్ను డిస్మిస్ చెయ్యండన్నఅశ్వద్ధామరెడ్డి

తమ ప్రభుత్వం ఇప్పటికే తమ విధానం స్పష్టం చేసిందన్నారు. అన్ని చర్యలు తీసుకుంటున్నామని..సిబ్బంది విధుల్లో లేకపోయినా ఒక్క బస్సు కూడా ఆగకుండా జాగ్రత్త పడుతున్నామని వివరించారు. ఇవ్వాల్సిన జీతాల పైనా నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్మిక సంఘాల నేతల కోసం కాకుండా..ప్రజల పక్షాన రాజకీయ పార్టీలు ఆలోచించాలని మంత్రి సూచించారు. తాత్కాలిక సిబ్బంది నియామక ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసారు. తమ ప్రభుత్వంలోనే ఆర్టీసీ కార్మికులకు మేలు జరిగిందని చెప్పుకొచ్చారు. పక్కనోడు తొడ కోసుకున్నారని..మేము మెడ కోసుకోము అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.

వారు తొడ కోసుకుంటే..మేము మెడ కోసుకోం

వారు తొడ కోసుకుంటే..మేము మెడ కోసుకోం

తాము ఎప్పుడూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తాము ఎన్నడూ హామీ ఇవ్వలేదని మరోసారి ప్రభుత్వం స్పష్టం చేసింది. పక్క వాళ్లు తొడ కోసుకుంటే..తాము మెడ కోసకోమని వ్యాఖ్యానించారు. ఆర్టీసీనీ ఏపీ ప్రభుత్వం తమ హామీల్లో భాగంగా విలీనం ప్రక్రియ చేస్తోందని..అది తాము అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు ఏపీ ప్రభుత్వం అమలు చేయటం లేదన్నారు. ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలు ఉంటాయని..దానికి అనుగుణంగా నడుచుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు 25 శాతం ఫిట్ మెంట్ ఆశిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి 43 శాతం ఇచ్చారని వివరించారు. అదే విధంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్లుగా ఆర్టీసీ ఆస్తులు లక్ష కోట్లు కాదని.. 2015 బ్యాలెన్స్ షీట్ ప్రకారం రూ. 4416 కోట్లు మాత్రమే నని చెప్పుకొచ్చారు. ఈ అయిదేళ్లలో మరి కొంత పెరిగి ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఉద్యోగులే విధులు వదిలి వెల్లిపోయారు..చర్చలు లేవు

ఉద్యోగులే విధులు వదిలి వెల్లిపోయారు..చర్చలు లేవు

తాము ప్రభుత్వ పరంగా 5వ తేదీన సాయంత్రం లోగా విధుల్లో హాజరు కావాలని నిర్ధేశించినా కార్మిక సంఘాలు పట్టించుకోలేదని..ప్రభుత్వం నాడు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేసారు.
కార్మికులు అంతా సమ్మెలో ఉన్నా తాము సమర్ధవంతంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసామని..ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయగలిగామని వివరించారు. సంప్రదింపుల ప్రక్రియ పూర్తి కాకుండా సమ్మె ప్రారంభించింది కార్మిక సంఘాలే అంటూ మంత్రి మండిపడ్డారు. ప్రస్తుతం 7358 బస్సులు సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. సమ్మెకు మద్దతుగా నిలుస్తున్న రాజకీయ పార్టీల కార్మిక సంఘాల నేత ల గురించి కాకుండా..ప్రజల గురించి ఆలోచించాలని మంత్రి సూచించారు. మద్దతిస్తున్న పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసారా అని మంత్రి ప్రశ్నించారు. సమ్మెను ఎదుర్కోవటానికి తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని తీసుకుంటున్నామని మంత్రి చెప్పుకొచ్చారు.

ప్రయివేటీకరణ చేస్తామని చెప్పలేదు..

ప్రయివేటీకరణ చేస్తామని చెప్పలేదు..

తమ ప్రభుత్వం ఎక్కడా ఆర్టీసీని ప్రవేటీకరణ చేస్తామని చెప్పలేదని..అదే సమయంలో సంస్థను కాపాడుకోవటం కోసం కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. దీని పైన ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారని..అదే సమయంలో ఆర్టీసీ ప్రభుత్వంలోనే ఉండాలనే విషయం స్పష్టం చేసారని గుర్తు చేసారు. 50 శాతం ఆర్టీసీ..30 శాతం అద్దె బస్సులు..20 శాతం ప్రయివేటు సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. కార్మికులకు చెల్లించాల్సిన జీతాల పైన సానుకూలంగా మంత్రి స్పందించారు. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లోనే కార్మిక సంఘాలు తాము విధులకు దూరంగా ఉంటున్నామనే విషయం అంగీకరించారని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్న బస్సుల సంఖ్యను పెంచుతామని మంత్రి స్పష్టం చేసారు. సమ్మె కారణంగా ఎటువంటి నష్టం లేదనే భావనలో మంత్రి వ్యాఖ్యలు కనిపించాయి.

English summary
Minister Ajay clarified that no chance for TSRTC merge with govt at any cost.Govt never given that type of assurance to employees. Govt taking all the steps to run the all buses in all routes in strike time also. He says they can not follow ap govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X