
రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ అధికారంలోకి రాదు: సర్వేలన్నీ టీఆర్ఎస్ కే అనుకూలమట!!
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నుద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తమకు ఎక్కడా పోటీ కాదని, తమతో పోటీకి రాలేరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఇక తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్న దయాకర్ రావు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

రేవంత్ రెడ్డి తన సొంత ఇమేజ్ కోసమే పని చేస్తారు : మంత్రి ఎర్రబెల్లి
రేవంత్ రెడ్డి ఎప్పుడూ తన సొంత ఇమేజ్ కోసమే ప్రయత్నం చేస్తారని, పార్టీ కోసం రేవంత్ రెడ్డి పనిచేయరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మరోవైపు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం పైకం కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్రలో బీజేపీ ప్రాంతీయ పార్టీలను చీల్చే కుట్ర చేస్తుంది
బీజేపీ
నేతలు
ప్రాంతీయ
పార్టీల
ను
చీల్చే
ప్రయత్నం
చేస్తున్నారని
ఎర్రబెల్లి
దయాకర్
రావు
మండిపడ్డారు.
బిజెపి
నేతలు
మూర్ఖులు
అంటూ
ఎర్రబెల్లి
దయాకర్
రావు
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
మహారాష్ట్రలోని
ప్రాంతీయ
పార్టీలను
చీల్చే
క్రమంలో
భాగంగానే
మహారాష్ట్ర
సంక్షోభం
ఏర్పడిందని
ఎర్రబెల్లి
దయాకర్
రావు
స్పష్టం
చేశారు.
ఇదంతా
బీజేపీ
కుట్రగా
అభివర్ణించిన
ఎర్రబెల్లి
దయాకర్
రావు
తెలంగాణలో
మాత్రం
బీజేపీ
ఎన్ని
వ్యూహాలు
రచించినా
ఫలితం
ఉండదని
తేల్చిచెప్పారు.
కేంద్ర
ప్రభుత్వ
ధోరణిపై
విమర్శలు
గుప్పించిన
ఎర్రబెల్లి
దయాకర్
రావు
కేంద్రం
తమ
ప్రభుత్వాన్ని
ఎన్ని
ఇబ్బందులు
పెట్టినా
తట్టుకుని
నిలబడగలిగామని
వెల్లడించారు.

ఇటీవల ఎన్నికల సర్వేలు టీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చాయి
ఇటీవల జరిపిన ఎన్నికల సర్వేలు టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పై కక్ష సాధింపు ధోరణితో కేంద్రం ఉందని పేర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు పల్లె ప్రగతి కార్యక్రమం నడుస్తున్న సమయంలో ఆరు జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు తనిఖీలు చేశారంటూ వెల్లడించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో అధికారులు పాల్గొనకుండా చేశారని మండిపడ్డారు. కావాలనే ఈజీఎస్ నిధులు నిలిపివేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా తెలంగాణా సర్కార్ ను ఏం చెయ్యలేదు
కేంద్రం
నుండి
తెలంగాణ
రాష్ట్రానికి
ఇంకా
ఎనిమిది
వందల
కోట్ల
రూపాయల
నిధులు
రావాలని
ఎర్రబెల్లి
దయాకర్
రావు
పేర్కొన్నారు.
కేంద్రం
నుండి
నిధులు
తీసుకురావడం
చేతగాని
తెలంగాణ
బీజేపీ
ఎంపీలు
అడ్డగోలు
ఆరోపణలు
చేస్తున్నారంటూ
మండిపడ్డారు.
బిజెపి
నేతలు
ఎన్ని
ఎత్తులు
వేసినా
తెలంగాణ
రాష్ట్రంలో
ప్రభుత్వాన్ని
ఏమీ
చేయలేరని
మంత్రి
ఎర్రబెల్లి
దయాకర్
రావు
తేల్చి
చెప్పారు.