ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి; ఎలుకలు రోగిని కొరికిన ఘటనపై ఏమన్నారంటే!!
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. శుక్రవారం నాడు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ను సందర్శించి, పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాస్పిటల్ లో ముందుగా ఎలుకలు దాడి చేసిన వార్డును పరిశీలించి, ఆ పేషంట్ ను పరామర్శించారు. ఎలుకలు కొరికిన రోగి బంధువులతో మాట్లాడిన మంత్రి ఘటనకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
కేసీఆర్
కిట్
లో
ఎలుకలు
చేరి
రోగుల
ప్రాణాలతో
చెలగాటమాడుతున్నాయి:
రేవంత్
రెడ్డి
సెటైర్లు

ఎంజీఎం ఆస్పత్రిని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
అనంతరం
ఎంజీఎం
హాస్పిటల్
లోని
పలు
విభాగాలను
సందర్శించి
అక్కడి
పరిస్థితులను
మంత్రి
పరిశీలించారు.
పారిశుద్ధ్యం
నిర్వహణ,
వార్డుల
నిర్వహణ,
సిబ్బంది,
పేషంట్ల
కు
అందుతున్న
వైద్యం
వంటి
అనేక
అంశాలపై
ఆరా
తీసిన
మంత్రి,
డైరెక్టర్
ఆఫ్
మెడికల్
ఎడ్యుకేషన్
రమేశ్
రెడ్డి,
హాస్పిటల్
సూపరింటెండెంట్
చంద్రశేఖర్,
ఆర్
ఎం
ఓ
లు,
వివిధ
విభాగాల
అధిపతులు,
నర్సింగ్,
పారా
మెడికల్
సిబ్బంది,
పారిశుద్ధ్య
సిబ్బంది
తదితరులతో
ప్రత్యేకంగా
మాట్లాడి,
హాస్పిటల్
నిర్వహణ
పై
సమీక్షించారు.

ఎంజీఎంలో రోగిని ఎలుకలు కొరికిన ఘటన దురదృష్టకరం
అనంతరం
మీడియాతో
మాట్లాడిన
మంత్రి
ఎంజీఎంలో
నిన్న
జరిగిన
ఘటన
దురదృష్టకరమని
పేర్కొన్నారు.
గవర్నమెంట్
ఆసుపత్రులలో
సహజంగానే
పేషెంట్ల
విషయంలో
జాగ్రత్త
చర్యలు
తీసుకుంటారని
పేర్కొన్న
ఆయన,
కావాలని
పేషెంట్లు
పట్ల
నిర్లక్ష్యం
చెయ్యరని
వెల్లడించారు.
ఎంజీఎంలో
గురువారం
రోగిని
ఎలుకలు
కొరికిన
ఘటన
విచారకరమని
పేర్కొన్న
ఆయన,
బాధ్యులపై
చర్యలు
తీసుకోవడానికి
ప్రభుత్వం
వేగంగా
స్పందించిందని
అన్నారు.
వైద్య
ఆరోగ్య
శాఖ
మంత్రి
హరీష్
రావు
వెంటనే
విచారణ
జరిపి,
బాధ్యులుగా
భావిస్తున్న
సూపరిండెంట్
ను
బదిలీ
చేశారని,
ఇద్దరు
డాక్టర్లను
సస్పెండ్
చేశారని
వెల్లడించారు.

ఎంజీఎం ఆస్పత్రిపై గట్టి నిఘా పెడతాం
ఇక పారిశుధ్య ఏజెన్సీల పైన కూడా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎంజీఎంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని, ఇకపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధైర్యంగా నమ్మకంగా ఎంజీఎం ఆస్పత్రికి రావొచ్చని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు

మెడికల్ హబ్ గా వరంగల్ .. సూపర్ మల్టీ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో
ఉమ్మడి
రాష్ట్రంలో
ఎంజీఎం
ఆస్పత్రికి
నిర్లక్ష్యానికి
గురైందని
పేర్కొన్న
మంత్రి,
తెలంగాణ
రాష్ట్రం
వచ్చిన
తర్వాత
ఎంజీఎం
ఆస్పత్రికి
మహర్దశ
పట్టిందన్నారు.
సీఎం
కెసిఆర్
ప్రత్యేక
దృష్టి
పెట్టి
గతంలో
ఎంజీఎం
కి
బడ్జెట్
లో
100
కోట్లు
కేటాయించారని
మంత్రి
పేర్కొన్నారు.
సిఎం
కెసిఆర్
బంగారు
తెలంగాణలో
భాగంగా
ఆరోగ్య
తెలంగాణ
సాధించాలని
నిర్ణయించారని
మంత్రి
ఎర్రబెల్లి
దయాకర్
రావు
తెలిపారు.
సిఎం
కెసిఆర్
ఆశీస్సులతో
హైదరాబాద్
తర్వాత
వరంగల్
మెడికల్
హబ్
గా
మారబోతుంది
అన్నారు.
ఉమ్మడి
వరంగల్
జిల్లా
సహా,
ఉత్తర
తెలంగాణ
ప్రజలకు
సరిపడా
సూపర్
మల్టీ
స్పెషాలిటీ
వైద్యం...
వరంగల్
లో
అందుబాటులోకి
తెచ్చామని
ఎర్రబెల్లి
స్పష్టం
చేశారు.

వరంగల్ లో 11 వందల కోట్లతో అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం
కరోనా
కష్టకాలంలో
నిరుపేదలకు
అండగా
ఎంజీఎం
ఆస్పత్రి
నిలిచిందని
పేర్కొన్న
ఆయన,
వైద్య
రంగానికి
తెలంగాణ
ప్రభుత్వం
పెద్దపీట
వేస్తుందని
వెల్లడించారు.
కాకతీయ
మెడికల్
కళాశాలలో
సీట్లను
పెంచుకున్నామని,
వరంగల్
నగరంలో
సెంట్రల్
జైలు
స్థలంలో
11
వందల
కోట్లతో
అత్యాధునిక
మల్టీ
సూపర్
స్పెషాలిటీ
ఆసుపత్రి
నిర్మాణం
చేపట్టామని
ఎర్రబెల్లి
దయాకర్
రావు
పేర్కొన్నారు.
సీఎం
కేసీఆర్
హయాంలో
తెలంగాణ
అన్ని
రంగాల్లో
అభివృద్ధి
చెందుతుందని
మంత్రి
తెలిపారు.
కెసిఆర్
నేతృత్వంలో
ప్రభుత్వ
దవాఖానాల
మీద
ప్రజలకు
నమ్మకం
పెరిగిందన్నారు.
బయటకు
వెళ్లి
డబ్బులు
లక్షల్లో
ఖర్చు
చేసుకోకుండా,
ప్రభుత్వ
ఆసుపత్రులకు
వెళ్లి
మెరుగైన
వైద్యం
చేయించుకోవాలని
ఎర్రబెల్లి
దయాకర్
రావు
సూచించారు.