వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాపై వాళ్లకు కనీస పరిజ్ఞానం ఉందా .. వైఎస్ షర్మిల పార్టీపై మంత్రి హరీష్ రావు పరోక్ష వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తాడు, కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు ప్రకటన చేసిన షర్మిలపై అధికార టీఆర్ఎస్ నిప్పులు జరుగుతోంది. అన్న పై కోపం ఉంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టాలి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం పని అంటూ టిఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ మినహాయించి ఏ పార్టీ అయినా ప్రజలు బొంద పెడతారని తేల్చి చెబుతున్నారు.ఇదే సమయంలో వైయస్ షర్మిల పార్టీపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సైతం వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

YS Jagan: వైఎస్ షర్మిల రాజకీయ పార్టీపై నోరు మెదపని జగనన్న...ఆసక్తికర చర్చ!YS Jagan: వైఎస్ షర్మిల రాజకీయ పార్టీపై నోరు మెదపని జగనన్న...ఆసక్తికర చర్చ!

సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో బుధవారం నాడు రైతు వేదిక ను ప్రారంభించిన హరీష్ రావు ఈ సందర్భంగా మాట్లాడారు. ఎవరో వచ్చి తెలంగాణలో రైతులకు ఏం న్యాయం జరిగిందని మాట్లాడుతున్నారని ఇక్కడకు వచ్చి రైతుల గురించి మొసలికన్నీరు కారుస్తున్నారని పరోక్షంగా షర్మిలనుద్దేశించి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు . తెలంగాణలో రైతులకు న్యాయం జరిగిందా అని ప్రశ్నించే వాళ్లకు తెలంగాణ గురించి కనీస పరిజ్ఞానం ఉందా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు.

Minister Harish Rao indirect remarks on YS Sharmilas new party

ఏపీ లో రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఎంత భూమి ఉన్నా 12,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతుబంధు ఇస్తున్నామని హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణపై షర్మిలకు కనీస పరిజ్ఞానం లేదంటూ పరోక్ష విమర్శలు చేశారు హరీష్ రావ్ . రైతుల కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, తెలంగాణ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నించారు హరీష్ రావ్. గత ప్రభుత్వాల హయాంలో రైతులు దోపిడీ చేశారని, టిడిపి కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు హరీష్ రావు.

English summary
Harish Rao, spoke on the YS Sharmila's new party in telangana . Harish Rao indirectly made harsh remarks to Sharmila that someone has come here and is talking about what justice has been done to the farmers in Telangana and is showing sympathetic words on the farmers. Harish Rao questioned whether those who question whether justice has been done to the farmers in Telangana have a minimum knowledge about Telangana?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X