వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రెండు పార్టీలు ఉసుళ్ల లాంటివి, వచ్చి వెళతాయి.. హరీశ్ రావు విసుర్లు..

|
Google Oneindia TeluguNews

దుబ్బాక ఉప ఎన్నికలో ప్రచార పర్వం కొనసాగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు.. అస్త్ర శస్త్రాలతో రంగంలోకి దిగాయి. టీఆర్ఎస్ నుంచి మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేస్తున్నారు.

కాకి రెట్టంత కూడా చేయలే, గోబెల్స్ ప్రచారం: దుబ్బాక బై పోల్‌ క్యాంపెయిన్‌లో హరీశ్ రావు..కాకి రెట్టంత కూడా చేయలే, గోబెల్స్ ప్రచారం: దుబ్బాక బై పోల్‌ క్యాంపెయిన్‌లో హరీశ్ రావు..

ఆ రెండు పార్టీలపై విసుర్లు..

ఆ రెండు పార్టీలపై విసుర్లు..


దౌలతాబాద్ మండలంలో శనివారం మంత్రి హరీశ్ రావు ప్రచారం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఆ పార్టీలకు నిబద్దత లేదు అని విరుచుకుపడ్డారు. వారు వానాకాలంలో వచ్చే ఉసిళ్ల వంటి వారు అని ధ్వజమెత్తారు. వస్తారు.. వెళతారు తప్పా.. ప్రజలకు చేసేదీ ఏమీ ఉండదని మండిపడ్డారు. కానీ ప్రజలతో అనునిత్యం ఉండేది.. టీఆర్ఎస్ శ్రేణులే అని బల్ల గుద్దీ మరీ చెప్పారు.

ఎండమావులు అని..

ఎండమావులు అని..

అంతేకాదు ఆ రెండు పార్టీలు ఎండమావులు వంటి వారు అన్నారు. ఆ పార్టీలతో వెళితే వచ్చేది ఏమీ ఉండదని చెప్పారు. గత పాలనను చూసి ప్రజలు అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో తాగునీటి సమస్యకు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కారణం కాదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు విద్యుత్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. కానీ మళ్లీ అదీ చేస్తాం.. ఇదీ చేస్తాం... అని హామీలు మాత్రం ఇస్తుంటారని ధ్వజమెత్తారు.

Recommended Video

Bihar Elections 2020 : PM Modi To Hold 12 Election Rallies in Bihar| NDA alliance VS Mahagathbandhan
చెరో వాదన అని..

చెరో వాదన అని..

కరెంట్ అంశంపై కాంగ్రెస్, బీజేపీలో చెరో వాదన అని హరీశ్ రావు మండిపడ్డారు. కరెంట్ ఇవ్వక కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడితే.. మీటర్లు ఏర్పాటు చేయాలని బీజేపీ చూస్తోందని ధ్వజమెత్తారు. కానీ కరోనా వైరస్, మాంద్యం ఉన్న సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అని చెప్పారు. ఆ రెండు పార్టీలు మాటలు చెబితే.. తాము చేసి చూపించామని హరీశ్ రావు పేర్కొన్నారు.

English summary
telangana minister harish rao slams congress, bjp. solipeta sujatha will be win the by poll elections he said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X