హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్ ప్రచారంలో మంత్రి హరీశ్ రావు: పేలిన మాటల తూటాలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గోదావరి నీళ్లను నగరానికి తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. పటాన్ చెరులో జరిగిన టీఆర్ఎస్ బహిరంగసభకు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేకాట క్లబ్‌లను బంద్ చేయించిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆరే అన్నారు.

మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లా నీరు అందిస్తున్నామని అన్నారు. కంటి ముందు అభ్యర్థి, ఇంటి ముందు అభివృద్ధిని చూసి ఓటేయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీడీపీలకు ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణమైనా చెప్పాలన్నారు.

ఆడబిడ్డల పెళ్లి కోసం రూ.51వేలు ఇస్తున్నామన్నారు. కొత్త బడ్జెట్‌లో తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ కళ్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తున్నామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. వృద్దులు, వితంతువులకు రూ. 1000 పెన్షన్ ఇస్తున్నామన్నారు.

మహిళల భద్రత కోసం షీటీమ్స్ ఏర్పాటు చేయడంతోపాటు నగరంలోని అన్ని పోలీస్‌స్టేషన్లను ఆధునీకరించినట్టు తెలిపారు. పల్లెటూర్లు, పట్టణాలు అనే తేడా లేకండా 24గంటల కరెంట్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. సెలూన్ షాపుల్లో కరెంట్ బిల్లులను ప్రభుత్వం డొమెస్టిక్ కిందకు తెచ్చామన్నారు.

పేదవారికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ 6కిలోల బియ్యం అందజేస్తున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 గ్రేటర్ ప్రచారంలో మంత్రి హరీశ్ రావు: పేలిన మాటల తూటాలు

English summary
MInister Harish rao Starts Ghmc election campaign in patancheru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X