రంగంలోకి హరీష్: రేవంత్‌పై కెసిఆర్ మైండ్‌గేమ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టిడిపికి రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు టిఆర్ఎస్ నాయకత్వం వ్యూహలను రచిస్తోంది. హరీష్‌రావు రంగంలోకి దిగారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత హరీష్‌రావు కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మకాం వేయనున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా టిఆర్ఎస్ వ్యూహ రచన చేస్తోంది.

మోత్కుపల్లి: రేవంత్‌కు చెక్‌ కోసమే టిఆర్ఎస్ పొత్తు, ఒంటరి పోరేనా?

గత నెల 31వ, తేదిన రేవంత్‌రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు టిడిపి నేతలు టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరారు.

రేవంత్‌కు మోత్కుపల్లి షాక్: 'మురికిపోయింది, ప్రజలే బుద్ది చెబుతారు'

ఈ నియోజకవర్గంలో టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతలపై టిఆర్ఎస్ కేంద్రీకరించింది. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ దషా జరిగే ఎన్నికల్లో రేవంత్‌రెడ్డిని ఓడించేందుకు హరీష్‌రావును రంగంలోకి దింపింది.

కొడంగల్: ఆ రెండు పార్టీల నేతలపై టిఆర్ఎస్ వల, రేవంత్‌కు చిక్కులేనా?

 రేవంత్‌రెడ్డిపై హరీష్‌రావు స్కెచ్

రేవంత్‌రెడ్డిపై హరీష్‌రావు స్కెచ్

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర బారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావుకు బాధ్యతలను అప్పగించారు. ముఖ్యమంత్రి కెసిఆర్. అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నందున హరీష్‌రావు సహచర మంత్రులతో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.ఇప్పటికే ప్రతి రోజూ ఈ నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు టిఆర్ఎస్‌లో చేరుతున్నారు.

కొడంగల్‌లో హరీష్ రావు మకాం

కొడంగల్‌లో హరీష్ రావు మకాం


అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కొడంగల్‌లో మకాం వేసే అవకాశం ఉందని టిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై బిజీగా ఉంటూనే కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడ అనుసరించాల్సిన వ్యూహంపై హరీష్‌రావు వ్యూహలు రచిస్తున్నారు. ఇప్పటికే కొందరు ముఖ్యులను హరీష్‌రావు కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి పంపారని సమాచారం. ఈ నియోజకవర్గంలో రేవంత్‌ను దెబ్బతీసేందుకు కలిసివచ్చే అవకాశాలు ఏమిటనే విషయమై చర్చించనున్నారు.

 రేవంత్‌ను దెబ్బతీసేందుకే

రేవంత్‌ను దెబ్బతీసేందుకే


టిఆర్ఎస్‌కు కొరకరాని కొయ్యగా మారిన రేవంత్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలంటే అసెంబ్లీలోకి రేవంత్‌ను అడుగుపెట్టకుండా చేయాలని టిఆర్ఎస్ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. అయితే ఈ విషయమై ఇప్పటికే టిఆర్ఎస్ నాయకత్వం రేవంత్‌రెడ్డిని మానసికంగా దెబ్బతీసేందుకు మైండ్‌గేమ్ ఆడుతోంది. కొడంగల్ ప్రజాప్రతినిధులనూ, రేవంత్ అనుచరులను టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకుని ఒక ముందగుడు వేసింది.

 కొడంగల్‌‌ను సీరియస్ గా తీసుకోవాలి

కొడంగల్‌‌ను సీరియస్ గా తీసుకోవాలి


గతంలో ఎన్ని ఉప ఎన్నికలు గెలిచినా.. కొడంగల్‌ను ప్రత్యేకంగా చూడాలని పార్టీ ముఖ్యులకు సీఎం చెబుతున్నారు. ఏ మాత్రం అలసత్వం వహించి... తేడా వచ్చినా మొత్తం సీన్ మారిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఉప ఎన్నికల్లో విజయాన్ని అవలీలగా సాధించిన చరిత్ర టిఆర్ఎస్‌కు ఉంది. అయితే రేవంంత్‌రెడ్డిని సాదాసీదాగా చూడకూడదని పార్టీ నేతలకు కెసిఆర్ సూచించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
By-Poll is likely in Kodangal constituency following Revanth Reddy's resignation to party MLA post sometimes back. As the election is more likely to take place, the ruling TRS has been reportedly making political strategies to make its mark in Kodangal constituency ahead of the By-Polls.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి