వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం కుట్ర... నష్టపోనున్న ప్రజలు... గతంలోనే మోదీకి కేసీఆర్ లేఖ...

|
Google Oneindia TeluguNews

కేంద్రం తీసుకురాబోతున్న విద్యుత్ స‌వ‌ర‌ణ చ‌ట్ట బిల్లుతో రాష్ట్రాల హక్కుకు తీవ్ర భంగం కలుగుతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్రాల హక్కులను ప్రైవేట్ పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. విద్యుత్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుతో అత్యవసర సర్వీసును ప్రైవేట్‌ పరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి జాతీయ స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సదస్సులో జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

గతంలోనే కేసీఆర్ లేఖ...

గతంలోనే కేసీఆర్ లేఖ...

'విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై కేంద్ర విద్యుత్ శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరారు. ఈ బిల్లు ప్రజా వ్యతిరేకమని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీనివల్ల రాష్ట్రానికి,ప్రజలకూ ఉపయోగం లేదని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. తాజా బిల్లుతో రైతాంగానికి,సబ్సిడీలు పొందే గృహ వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. చిన్న చిన్న వినియోగదారులు కూడా సబ్సిడీలను కోల్పోతారు. కాబట్టి విద్యుత్ బిల్లును వ్యతిరేకించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.' అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రాల అభ్యంతరాలను పట్టించుకోని కేంద్రం...

రాష్ట్రాల అభ్యంతరాలను పట్టించుకోని కేంద్రం...


'దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా ఈ విద్యుత్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. పంజాబ్‌, రాజస్థాన్‌, కేరళ వంటి రాష్ట్రాలు బిల్లులను వ్యతిరేకించాయి. రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా.. కేంద్రం మాత్రం పట్టించుకోవట్లేదు. మార్పులు చేస్తామని మాటలతో చెప్పినప్పటికీ... బిల్లులో ఒక్కలైన్‌ కూడా మార్చు చేయలేదు. సమాఖ్య ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరులో కేంద్రం నడుచుకోవట్లేదు.' అని జగదీష్ రెడ్డి మండిపడ్డారు.

బిల్లును వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం...

బిల్లును వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం...


'కోవిడ్ 19 కారణంగా డిస్కమ్‌లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డిస్కమ్‌లకు 9.5శాతం వడ్డీతో ఇస్తామన్న అప్పును ఒక శాతం తగ్గించమన్నాం. తెలంగాణ రైతాంగానికి గొడ్డలి పెట్టు లాంటి ఈ బిల్లును టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లు వల్ల వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనం చేకూరక పోగా గృహ వినియోగదారులు సబ్సిడీ కోల్పోతారని చెప్పారు. సబ్సిడీ పొందుతున్న అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు.' అని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

Recommended Video

₹400 Crore New Secretariat Only Because Of Vaastu Dosha (Problem with the Architecture) || Oneindia
భద్రాద్రి రెండో ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం..

భద్రాద్రి రెండో ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం..


భద్రాద్రి పవర్ ప్లాంట్ రెండో యూనిట్ 270 మెగావాట్లు అనుసంధానించామని జగదీష్ రెడ్డి అన్నారు. రెండో ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. కొంతమంది కోర్టుల్లో కేసులు వేయడం వల్లే ఉత్పత్తి ఆలస్యమైందన్నారు. మరో నెలన్నర రోజుల్లో మూడో యూనిట్‌ను కూడా ప్రారంభిస్తామని,భద్రాద్రిలో 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.

English summary
Telangana minister Jagadish Reddy said that TRS government is opposing electiricity amendment bill and alleged domestic users will lost subsidy due to this new act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X