కేంద్ర రైతు వ్యతిరేక విధానాలను ఎండ గట్టాలి.!బీజేపి శ్రేణులను తరిమికొట్టాలన్న మంత్రి జగదీశ్ రెడ్డి.!
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని టిఆర్ఎస్ శ్రేణులకు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజేపి ప్రభుత్వం ఏర్పడిన ఏడూ సంవత్సరాల కాలం లో అన్నీ రైతు వ్యతిరేక విధానాలను తీసుకుందని ఆయన ఆరోపించారు. రైతుల ఆదాయాన్నీ రెండింతలు చేస్తామన్న మోడీ సర్కార్ దళారుల ఆదాయాన్ని మాత్రమే రెండింతలు పెంచిందని మంత్రి జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు.

బీజేపి పాలనలో ఆధానిలు,అంబానీలు పెరుగుతున్నారు. పేదలు మాత్రం మరింత పేదలుగా మారుతున్నారు
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేపట్టిన విధానాల వల్లనే తెలంగాణా లో రైతుల ఆదాయం పెరిగింది సుస్పష్టం అని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువులు, డీజిల్,పెట్రోల్ ధరల తో తెలంగాణా రైతు జేబుకు కుడా చిల్లు పడిందన్నారు.గడిచిన ఏడేండ్లలో భారత దేశ రైతుకు బిజెపి పాలనలో ఒరిగింది ఏమి లేదని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. పైగా బిజెపి వైఖరి దొంగే దొంగా...దొంగా అన్న చందంగా మారిందని ఆయన ఎద్దేవాచేశారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి గా రైతు బాంధవ్యుడిగా రైతుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పరిష్కరిస్తున్నారన్నారు.

దొంగ చాటున రైతు చట్టాలు అమలు చేసే యత్నం.. బిజెపి నేతలు ఊరకుక్కలు
కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వస్తే సమాధానం చెప్పాల్సిన ప్రధానమంత్రి మోడీ మౌనంగా ఉండి రాష్ట్ర నాయకులతో ఊరకుక్కల్లా మోరిగిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలసింది ముమ్మాటికీ కేంద్రమే నని ఆయన చెప్పారు. గడిచిన ఏడేండ్ల లో బిజెపి వల్ల దేశ ప్రజలకు ఒరిగింది ఏమి లేదు అన్నది యావత్ భారతదేశం ఇప్పటికే గుర్తించిందన్నారు. కొత్త ఉద్యోగాలు రాక పోగా ఉన్న ఉద్యోగాలు ఉసిపోయ్యాయన్నారు.

కేసీఆర్ ప్రశ్నలకు కేంద్రం జవాబు చెప్పాల్సిందే.. పట్టుబట్టిన మంత్రి జగదీష్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లను తమ తాబేదార్లకు కట్టబెడుతూ దేశప్రజలను బిజెపి ప్రభుత్వం ముంచుతుందని ఆయన ఆరోపించారు. నల్లడబ్బు ను తెస్తామన్న ప్రధాని మోడీ ప్రస్తుతం పేద ప్రజల జేబులకు చిల్లులు పడేలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత నే ఆధానిలు,అంబానీలు పెరిగిండ్రు అని...ప్రజలు మాత్రం మరింత పేదలుగ మారిండ్రు అంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేకించి రైతాంగం నోట్లో మట్టికొడుతున్న ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం రికార్డ్ సృష్టించిందన్నారు.

ఎరువులు,డీజిల్,పెట్రోల్ ధరలపై పోరాటాలకు సిద్ధం కావాలి. గులాబీ శ్రేణులకు జగదీష్ రెడ్డి పిలుపు
రైతుల ఆగ్రహానికి బయపడ్డట్లు నటించిన బిజెపి ప్రభుత్వం మళ్ళీ రైతు చట్టాలను అమలు పరిచే కుట్రలకు తెర లేపిందన్న విషయాన్ని యావత్ రైతాంగం గుర్తించాలని ఆయన కోరారు. అటువంటి బిజెపి ప్రభుత్వం చేపట్టిన మోసపూరిత విధానాల పట్ల దేశ రైతాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువులు, డీజిల్,పెట్రోల్ ధరలు తగ్గించే దాకా ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం, టి ఆర్ యస్ శ్రేణులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.