• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బాలుడి కోరిక నెరవేర్చిన కేటీఆర్: చదువు ఖర్చులు భరిస్తానని హామీ (ఫోటోలు)

By Nageswara Rao
|

హైదరాబాద్: ప్రాణాపాయ స్థితిలో ఉండి తనను చూడాలని కోరుకున్న ఓ యువకుడి కోరికను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ నెరవేర్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామానికి చెందిన కృష్ణార్జున్‌రావు, జ్యోతి దంపతుల కుమారుడు సంతోష్‌ చిన్నప్పటి నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడేవాడు.

10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివి 9.5 పర్సంటేజీ తెచ్చుకున్నాడు. అయితే నొప్పి తీవ్రం కావడంతో ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో సంతోష్‌కు వైద్య పరీక్షలు చేయించారు. కడుపులో చిన్న, పెద్ద పేగులు మెలికలు పడడంతోపాటు దెబ్బతిన్నాయని, ఆపరేషన్‌ చేయాలని వైద్యులు చెప్పారు.

 బాలుడి కోరిక నెరవేర్చిన కేటీఆర్

బాలుడి కోరిక నెరవేర్చిన కేటీఆర్

కుటుంబ సభ్యుల అనుమతితో శస్త్రచికిత్స చేసి పేగులను కొంతమేర తొలగించారు. తర్వాత సంతోష్‌ను నిమ్స్‌కు తరలించారు. కొద్ది రోజులుగా నిమ్స్‌లోనే చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ యువకుడు కేటీఆర్‌ను చూడాలనుకుంటున్నాడని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది.

 బాలుడి కోరిక నెరవేర్చిన కేటీఆర్

బాలుడి కోరిక నెరవేర్చిన కేటీఆర్

వాళ్లు ఈ విషయాన్ని మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌ దృష్టికి తీసుకెళ్లగా సంస్థ ప్రతినిధులు కేటీఆర్‌కు ఈ విషయం చెప్పారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి కేటీఆర్‌ శుక్రవారం నిమ్స్‌కు వచ్చి బాలుడిని పరామర్శించారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కోలుకున్న తర్వాత సంతోష్‌కు ధైర్యం చెప్పడంతోపాటు చదువు కూడా చెప్పిస్తానని హామీ ఇచ్చారు.

బాలుడి కోరిక నెరవేర్చిన కేటీఆర్

బాలుడి కోరిక నెరవేర్చిన కేటీఆర్

అనంతరం బాలుడు మాట్లాడుతూ కేటీఆర్ సార్‌ను ఒక్కసారైనా చూడాలనే కోరిక తీరిందని అన్నాడు. కేటీఆర్ వచ్చి నా చేతిలో చేయి కలిపి మాట్లాడారని పేర్కొన్నాడు. భరోసా ఇచ్చారు. నీకేం భయం లేదు ఎంత ఖర్చైనా భరించి నిన్ను బాగు చేయిస్తా. నేను మళ్లీ వచ్చి నిన్ను కలుస్తా అని చెప్పారని అన్నాడు.

బాలుడి కోరిక నెరవేర్చిన కేటీఆర్

బాలుడి కోరిక నెరవేర్చిన కేటీఆర్

నేను ట్రిపుల్ ఐటీలో చేరుతాను అని కేటీఆర్ సారుకు చెప్పానని తప్పకుండా సీటు ఇప్పిస్తానని చెప్పారు. సార్ మాట ఎంతో సంతోషమనిపించింది అని వివరించారు. అనంతరం అక్యూట్ కిడ్నీ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. ఇటీవల నిమ్స్ వైద్యులు గుండెమార్పిడి చేసిన కరీంనగర్‌కు చెందిన ఓం లతతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

 బాలుడి కోరిక నెరవేర్చిన కేటీఆర్

బాలుడి కోరిక నెరవేర్చిన కేటీఆర్

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై ఆమె స్వయంగా రాసిన కవితను మంత్రులకు చదివి వినిపించారు. నిమ్స్‌లో 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించడంతో ఇప్పటివరకు ఉన్న ఎమర్జెన్సీ వార్డులోని 40 పడుకలను 96కు పెంచారు. ఈ విభాగాన్ని కూడా ఆయన ప్రారంభించారు.

 బాలుడి కోరిక నెరవేర్చిన కేటీఆర్

బాలుడి కోరిక నెరవేర్చిన కేటీఆర్

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ప్రజారోగ్యమే లక్ష్యంగా నిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ దవాఖానగా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక వైద్య సదుపాయలు కల్పిస్తున్నామని వివరించారు. త్వరలో నిమ్స్‌ను ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్‌గా మారుస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

 బాలుడి కోరిక నెరవేర్చిన కేటీఆర్

బాలుడి కోరిక నెరవేర్చిన కేటీఆర్

త్వరలో వైద్యారోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డితో కలిసి చెన్నై, తమిళనాడు రాష్ర్టాలలో పర్యటించి అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును అధ్యయనం చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హెమటాలజీ యూనిట్, అల్ట్రాసోనిక్ ఆక్జిరేట్, రూ. 20 లక్షలతో కార్డియాలజీ (టీఎండీ) కొత్త మిషన్‌ను కేటీఆర్ ప్రారంభించారు.

బాలుడి కోరిక నెరవేర్చిన కేటీఆర్

బాలుడి కోరిక నెరవేర్చిన కేటీఆర్

దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు అత్యవసర సేవలందించే క్రమంలో అదనంగా మరో 56 పడకలను పెంచినట్లుగా కేటీఆర్ చెప్పారు. అనంతరం సర్జికల్ అంకాలజీ యూనిట్‌ను ప్రారంభించారు. నిమ్స్ టోల్‌ఫ్రీ నంబర్ 040-23305463ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ పాల్గొన్నారు.

English summary
Minister KT Rama Rao visited Santosh, a 10th class student, who is suffering from a debilitating intestinal disorder. Santosh is currently undergoing treatment at NIMS hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X