వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ 'రద్దు' ప్రకటన, క్యాష్ లెస్ లావాదేవీలు: నెటిజన్లను అడిగిన కేటీఆర్

రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలు, సలహాలు సామాజిక అనుసంధానం ట్విట్టర్‌ ద్వారా తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కోరారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలు, సలహాలు సామాజిక అనుసంధానం ట్విట్టర్‌ ద్వారా తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కోరారు.

నగరాలు, పట్టణాల్లో నగదు రహిత లావాదేవీలపై అభిప్రాయాలు కోరారు. ప్లాస్టిక్‌, డిజిటల్‌ మనీ వినియోగం పైన కూడా సూచనలు, సలహాలు తెలపాలని కోరారు.

kt rama rao

అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి: వినోద్‌

కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఆర్టికల్‌ 4 కింద శాసనసభా స్థానాలు పెరుగుతాయని తెరాస ఎంపీ వినోద్‌ చెప్పారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పనిసరిగా తెలుగు రాష్ట్రాలకు శాసనసభ స్థానాలు పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ ద్వారా అసెంబ్లీ స్థానాలు పెంచాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో శాసనసభ స్థానాలను 153కు పెంచాలని సెక్షన్ 26లో ఉందని తెలిపారు. సెక్షన్ 26 ప్రకారం తప్పనిసరిగా అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాలన్నారు.

అసెంబ్లీ స్థానాలు పెంచడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదన్నారు. రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా అసెంబ్లీ స్థానాలు పెంచాలని హర్యానా విషయంలో సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఆర్టికల్ 4 కింద అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయన్నారు.

English summary
Minister KTR asks netizens opinion over demonetisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X