వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెప్పిన పంటలే వెయ్యాలని సీఎం కేసీఆర్ అనలేదట... క్లారిటీ ఇచ్చిన కేటీఆర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న రైతుబంధు విషయంలో కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారి మాటలు నమ్మొద్దని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తాము చెప్పిన వంటలనే వేయాలని చెప్పలేదని, డిమాండ్ వున్న పంటలు వేసుకోవాలని చెబుతున్నారని మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.

 వ్యవసాయం కొత్త పుంతలు తొక్కటానికే నియంత్రిత పంటల సాగు

వ్యవసాయం కొత్త పుంతలు తొక్కటానికే నియంత్రిత పంటల సాగు

నియంత్రిత పంటల విధానాన్ని కొందరు దుష్ప్రచారం చేస్తూ నియంతృత్వ పంటల విధానమని నియంత పంటల విధానం అని అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో శ్రమిస్తున్నారని చెప్పిన కేటీఆర్, ఇక దేశంలోనే రైతు సమస్యల గురించి పనిచేస్తున్న కెసిఆర్ ను మించిన ముఖ్యమంత్రి లేరని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించడం కోసమే సీఎం కేసీఆర్ నియంత్రిత పంటల విధానాన్ని తీసుకువచ్చారని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను పండించినట్లయితే రైతు ధనవంతుడు అయ్యే అవకాశం ఎక్కువ ఉందని ఆయన పేర్కొన్నారు.

జులై 15 లోగా వేసిన పంటలపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్న మంత్రి

జులై 15 లోగా వేసిన పంటలపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్న మంత్రి

రైతు వేదికల ద్వారా అన్నదాతలను సంఘటితం చేసి పంటలు పండేలా సమాలోచనలు చేయాలన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ రైతులకు సూచించారు. ఇక జులై 15వ తేదీలోగా జిల్లాలలో ఏ భూమిలో ఏ పంట వేశారు అనే సమగ్ర నివేదిక అధికారులు, ప్రజా ప్రతినిధులు అందించాలని మంత్రి ఆదేశించారు. దేశంలో 70 ఏళ్ళలో రైతుబంధు ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే అని కితాబిచ్చుకున్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, కరోనా కష్టకాలంలో ఉన్న రైతుబంధు నిధులు విడుదల చేశామని కేటీఆర్ గుర్తు చేశారు.

సీఎం కేసీఆర్ హయాంలో జలవిప్లవం .. మరో నాలుగు విప్లవాలు

సీఎం కేసీఆర్ హయాంలో జలవిప్లవం .. మరో నాలుగు విప్లవాలు

సిరిసిల్ల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్ని చెరువులు, కుంటలు నింపి, రైతుల సాగు నీటి అవసరాలు తీర్చి, అద్భుతమైన జలదృశ్యం సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారు అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రైతు పక్షపాత ప్రభుత్వం తమ ప్రభుత్వమని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో రాష్ట్రంలో జల విప్లవం వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక దీనికి పునాదిగా మరో నాలుగు విప్లవాలు కూడా రానున్నాయని పేర్కొన్నారు.

రైతు బంధు ఎగ్గొడతారనే దుష్ప్రచారం.. ధీటుగా బదులివ్వండి

రైతు బంధు ఎగ్గొడతారనే దుష్ప్రచారం.. ధీటుగా బదులివ్వండి

రైతులకు అన్ని విధాలుగా మేలు చేకూర్చేందుకు నియంత్రిత సాగు విధానం తీసుకొచ్చినట్లు చెప్పిన మంత్రి రైతుబంధు సక్రమంగా అందేలా క్షేత్రస్థాయిలో అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇక రైతు బంధు పై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి ధీటుగా సమాధానం ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశానికి అర్థం ఆదర్శంగా రైతు బంధుని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ దానిని ఎగ్గొట్టి రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తారా అంటూ విపక్ష పార్టీలను ప్రశ్నించారు.

పంటల సాగుకు , రైతు బంధుకు లింక్ పెట్టటం తప్పన్న మంత్రి

పంటల సాగుకు , రైతు బంధుకు లింక్ పెట్టటం తప్పన్న మంత్రి


మొత్తానికి నియంత్రిత సాగు విధానానికి, రైతుబంధు డబ్బులకు లింకు పెట్టి ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేస్తేనే రైతుబంధు ఇస్తామని ప్రకటించిన సీఎం కెసిఆర్ వ్యాఖ్యలతో ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్న వేళ కేటీఆర్ సీఎం కేసీఆర్ ఆ విధంగా చెప్పలేదని, డిమాండ్ ఉన్న పంటల్ని పండించాలని చెప్పారని చెప్పటం ఆసక్తికర అంశం .

English summary
Minister KTR said deliberately misrepresenting some of the political parties ,Telangana state government's ambitious Raithu Bandhu scheme. Minister KTR gave clarity that the CM KCR did not say that they should be put the crops what he said. he only said to do agriculture with demand crops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X