హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'మై జీహెచ్ఎంసీ' యాప్ ఉపయోగాలివే: హరితహారానికి కేటీఆర్ నెల జీతం విరాళం

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రూపొందించిన మై జీహెచ్ఎంసీ యాప్‌ను మంత్రి కేటీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

దీనికోసం ఆధునాతన టెక్నాలజీని వినియోగించుకుంటున్నామని ఆయన చెప్పారు. మై జీహెచ్ఎంసీ యాప్ పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. యాప్‌ వినియోగంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు యంత్రాంగం మెరుగ్గా పనిచేయాలని ఆయన సూచించారు.

ఈ యాప్‌ జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆస్తిపన్ను, వ్యాపార లైసెన్సు, ఎల్‌ఆర్‌ఎస్‌, గ్రీవెన్స్‌ లాంటి వాటికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో వినియోగంలో ఉన్న ఆర్టీఏ ఎం వాలెట్‌కు మించిన ఆదరణ ఈ యాప్‌కు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 హరితహారం కోసం నెల జీతం విరాళంగా ప్రకటించిన కేటీఆర్

హరితహారం కోసం నెల జీతం విరాళంగా ప్రకటించిన కేటీఆర్

జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రూపొందించిన మై జీహెచ్ఎంసీ యాప్‌ను మంత్రి కేటీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

 హరితహారం కోసం నెల జీతం విరాళంగా ప్రకటించిన కేటీఆర్

హరితహారం కోసం నెల జీతం విరాళంగా ప్రకటించిన కేటీఆర్

దీనికోసం ఆధునాతన టెక్నాలజీని వినియోగించుకుంటున్నామని ఆయన చెప్పారు. మై జీహెచ్ఎంసీ యాప్ పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. యాప్‌ వినియోగంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు యంత్రాంగం మెరుగ్గా పనిచేయాలని ఆయన సూచించారు.

 హరితహారం కోసం నెల జీతం విరాళంగా ప్రకటించిన కేటీఆర్

హరితహారం కోసం నెల జీతం విరాళంగా ప్రకటించిన కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఆయనతో పాటు తెలంగాణ వ్యాప్తంగా మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు హరితహారం కార్యక్రమానికి తమ నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు.

 హరితహారం కోసం నెల జీతం విరాళంగా ప్రకటించిన కేటీఆర్

హరితహారం కోసం నెల జీతం విరాళంగా ప్రకటించిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం ఒక ఉద్యమంలా కొనసాగుతోందని ఆయన అన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం అమ‌ల‌వుతోన్న అంశంపై ఈనెల 18న వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

 హరితహారం కోసం నెల జీతం విరాళంగా ప్రకటించిన కేటీఆర్

హరితహారం కోసం నెల జీతం విరాళంగా ప్రకటించిన కేటీఆర్

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం కొన‌సాగ‌డానికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆయ‌న తెలిపారు. హ‌రితహారంపై మెరుగైన ప‌నితీరు క‌న‌బ‌రిస్తే ప్ర‌త్యేక నిధులు కూడా కేటాయిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. హ‌రిత‌హారానికి కార్పొరేష‌న్ ఛైర్మ‌న్లు, మేయ‌ర్లు, డిప్యూటీ మేయ‌ర్లు, ఛైర్ ప‌ర్స‌న్లు కృషి చేయాల‌ని ఆయ‌న సూచించారు.

English summary
The Greater Hyderabad Municipal Corporation (GHMC) is all set to launch a new integrated Mobile App ‘My GHMC’ on July 15. Minister for Municipal Administration and Urban Development (MAUD) KT Rama Rao would launch the app at GHMC head office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X