వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ‌కు నిధులు కేటాయించండి.. నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ లేఖ

|
Google Oneindia TeluguNews

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల కోసం కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీ అభివృద్థికి ఆర్థిక సాయం చేసి తోడ్పాటు నందించాలని లేఖలో కోరారు. నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై గతంలో అనేక సార్లు కేంద్రం దృష్టికి తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు.

ఇండస్ట్రియల్ కారిడార్లకు నిధులు ఇవ్వండి..

ఇండస్ట్రియల్ కారిడార్లకు నిధులు ఇవ్వండి..

వినూత్నమైన విధానాలతో ముందు వరుసలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర సహాయం అందించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ లేఖలో తెలిపారు. తెలంగాణలో భాగమైన నేషనల్ ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌కు నిధులివ్వాలని కోరారు. ఇండస్ట్రియల్ కారిడార్లకు కేటాయించాల్సిన నిధుల గురించి లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ - బెంగళూరు. హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్లకు రూ 1500 కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
హుజురాబాద్, జడ్చర్ల- గద్వాల్ - కొత్తకోట నొడ్లను ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నామని తెలిపారు.. ఈ రెండింటికి సంబంధించిన ప్రతిపాదనలు త్వరలోనే కేంద్రానికి పంపుతామని లేఖలో పేర్కొన్నారు.

 పురపాలక శాఖ ప్రాజెక్టులకు నిధులు కేటాయించండి..

పురపాలక శాఖ ప్రాజెక్టులకు నిధులు కేటాయించండి..

పురపాలకశాఖ తరుపున చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. కేపీహెచ్‌బీ నుంచి కోకాపేట మీదుగా నార్సింగ్ వరకు 30 కిలో మీటర్ల మేర ఎమ్మార్టీస్ మెట్రో నియో నెట్ వర్క్ ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు అంచనా వ్యయమైన 3050 కోట్లలో రూ.450 మంజూరు చేయాలని కోరారు. వరంగల్ మెట్రో నియో ప్రాజెక్టుకు రూ.184 కోట్ల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్యారడైజ్ నుంచి షామీర్ పేట ఓఆర్ఆర్ కూడలి, కండ్లకోయ వరకు ఆరులేన్ల ఎలివేటేడ్ కారిడార్లకు నిధులు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

హైదరాబాద్ ను డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌లో చేర్చాలి..

హైదరాబాద్ ను డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌లో చేర్చాలి..

డిఫెన్స్ ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు కేటీఆర్. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదించిన రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ల పరిధిలో హైదరాబాద్‌ను చేర్చాలని మంత్రి కేటీఆర్ ఈ లేఖ‌లో కోరారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబరేటరీ, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లేబరేటరీ, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ , బెల్ వంటి అనేక రక్షణ సంస్థలు ఇక్కడ ఉన్నాయని గుర్తు చేశారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తో పాటు అనేక ఇతర ప్రముఖ ప్రైవేట్ రక్షణ మరియు ఏరోస్పేస్ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. డిఫెన్స్ , ఏరోస్పేస్ రంగానికి కావలసిన అన్ని అవకాశాలు తెలంగాణలో ఉన్న నేపథ్యంలో తెలంగాణను కేంద్రం ప్రతిపాదించిన డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్లో భాగంగా గుర్తించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కోరారు.

English summary
Telangana minister ktr written letter to central minister sitharaman
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X