వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బతుకమ్మ చీరలు కవిత ‘జాగృతి’ వల్లే: కేటీఆర్ ప్రత్యేక వీడియో సందేశం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిజామాబాద్ మాజీ ఎంపీ, తన సోదరి కల్వకుంట్ల కవిత నేతృత్వంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి సంస్థపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ పల్లె జీవితాన్ని, ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే అద్భుతమైన పండగ బతుకమ్మ అని ఆయన అన్నారు.

కవిత విషయంలో కేసీఆర్ నిర్ణయం అదేనా? ఢిల్లీలో మళ్ళీ చక్రం తిప్పేలా గులాబీ బాస్ వ్యూహమా? కవిత విషయంలో కేసీఆర్ నిర్ణయం అదేనా? ఢిల్లీలో మళ్ళీ చక్రం తిప్పేలా గులాబీ బాస్ వ్యూహమా?

జాగృతి పోరాటం వల్లే..

జాగృతి పోరాటం వల్లే..

పువ్వుల్ని పూజించే విశిష్ట సంప్రదాయాన్ని స్వరాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఆయుధంగా.. విడదీయలేని ఉద్యమ రూపంగా మార్చిన ఘనత తెలంగాణ జాగృతి సంస్థదేనని అన్నారు. దేశంలోనేగాక, విదేశాల్లోని తెలంగాణ ఆడబిడ్డలు ఇవ్వాళ సగర్వంగా బతుకమ్మ పండగను జరుపుకోవడానికి కవిత నాయకత్వంలోని తెలంగాణ జాగృతి సంస్థ చేసిన కృషి, పోరాటమే కారణమని కేటీఆర్ కొనియాడారు.

చీరలకు జాగృతి ప్రేరణే..

చీరలకు జాగృతి ప్రేరణే..

నాటి సమైక్య పాలకులు ట్యాంక్ బండ్‌పై బతుకమ్మను నిషేధించి తెలంగాణ బిడ్డలను అవమానిస్తే.. హైకోర్టుకు వెళ్లి మరీ బతుకమ్మను సంబురంగా ఆడిన ఘన చరిత్ర జాగృతికి ఉందంటూ ప్రశంసించారు. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్న బతుకమ్మ చీరలకు ప్రేరణ జాగృతేనని అన్నారు.

సోషల్ మీడియాలో కేటీర్ ప్రశంసల వీడియో..

బతుకమ్మ పండగను విశ్వవ్యాప్తం చేసిన సోదరి కవిత, దశాబ్ద కాలంగా జాగృతిలో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. ఈ కేటీఆర్ వీడియో సందేశాన్ని తెలంగాణ జాగృతి సంస్థ తన ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల్లో పోస్టు చేసింది.

నైపుణ్య శిక్షణలోనూ..

నైపుణ్య శిక్షణలోనూ..

తెలంగాణ జాగృతి సంస్థను మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బతుకమ్మ సంబరాలను ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడంలో ఆమె చొరవ తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు కవిత. అంతేగాక, తెలంగాణ మహిళలు, యువతులకు నైపుణ్యాల శిక్షణ ఇవ్వడంలోనూ తెలంగాణ జాగృతి తమవంతు కృషి చేస్తోంది.

English summary
Telangana Minister Minister KTR Praises Kavitha and Telangana Jagruthi over Bathukamma Festival
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X