హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వర్ష బీభత్సం: తెలంగాణాను ఆదుకోవాలంటూ మోడీకి కోమటిరెడ్డి, వర్షాలు, వరదలపై కేటీఆర్ రివ్యూ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పురపాలక మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పురపాలక శాఖ అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

వర్షాలు: సీఎం జగన్ ప్రయారిటీ దీనికే - తెలంగాణ ఎఫెక్ట్ - చిత్తూరులో విచిత్ర పరిస్థితి - కీలక ఆదేశాలువర్షాలు: సీఎం జగన్ ప్రయారిటీ దీనికే - తెలంగాణ ఎఫెక్ట్ - చిత్తూరులో విచిత్ర పరిస్థితి - కీలక ఆదేశాలు

వరద ప్రభావిత ప్రాంతాల్లో..

జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న అధికారులంతా ఈ క్షేత్రంలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హాల్‌లకు తరలించాలని, వారికి అక్కడే ఆహారంతోపాటు అవసరమైన దుప్పట్లు, వైద్య సదుపాయం కల్పించాలని సూచించారు. ఇలాంటి క్యాంపుల్లో ప్రస్తుతం బస్తి దావఖానాలో పనిచేస్తున్న డాక్టర్లతోపాటు ఇతర వైద్య సిబ్బంది అందరూ పాల్గొనాలని సూచించారు.

ప్రజలను అప్రమత్తంగా ఉంచడంతోపాటు..

ప్రస్తుతం భారీ వర్షాలకు పెద్ద ఎత్తున నగరంలో చెట్లు, విద్యుత్ పోల్స్ కూలిపోయిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ, విద్యుత్ సంస్థలతో కలిసి సమన్వయం చేసుకోవాలని సూచనలు చేశారు. హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారిపోయాయి. వాటి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో మూసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నుంచి ప్రజలను తరలించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

మోడీజీ తెలంగాణను ఆదుకోండి: కోమటిరెడ్డి, కేసీఆర్ నిర్లక్ష్యం అంటూ..

ఇది ఇలావుండగా, తెలంగాణలో భారీ వర్షాల కారణంగా రాష్ట్రం నిండా మునిగిందని, జనజీవనం అస్తవ్యస్తం కావడంతో పాటు చేతికొచ్చిన పంట నీట మునిగిందని ఆందోళన వ్యక్తం చేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వర్షం సృష్టించిన బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీకి ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. తక్షణ సాయం కింద తెలంగాణ రాష్ట్రానికి రూ. 2 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. అంతేగాక, తెలంగాణలో వర్ష బీభత్సంపై ఏరియల్ సర్వే నిర్వహించాలని కోరారు. హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని, పెద్ద ఎత్తున పంట నష్టపోయి రైతులు ఆవేదనలో ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ వర్ష బీభత్సంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Recommended Video

Durgam Cheruvu Cable Bridge Inaugurated by KTR | Oneindia Telugu

English summary
minister ktr review on heavy rains in telangana: MP komatireddy asks help from PM Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X