కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్; కేంద్రం టార్గెట్ గా సవాళ్ళ వెనుక అంతర్యం అదేనా?
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మాటల యుద్ధానికి దిగుతుంటే, ప్రతిపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు అధికార టీఆర్ఎస్ నేతలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టి ప్రజల మద్దతు కూడగట్టడం కోసం ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుంటే, అధికార టీఆర్ఎస్ మాత్రం కేంద్రంలోని బిజెపిని టార్గెట్ చేసి, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందంటూ మండిపడుతోంది. తెలంగాణలో బీజేపీ నేతలకు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు తీసుకురావాలని సవాళ్ళు విసురుతుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక అంశంపై రాజకీయ రగడ కొనసాగుతుంది.అయితే సాధ్యం కాని అంశాలపై బీజేపీ నేతలకు సవాళ్లు విసురుతూ మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలను ఇరకాటంలోకి నెడుతున్నారు.

బీజేపీని టార్గెట్ చేస్తున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఏ చిన్న కార్యక్రమానికి వెళ్ళినా సరే బీజేపీని మాత్రం వదిలిపెట్టకుండా విమర్శిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదని, రాష్ట్రానికి ఇవ్వాల్సిన విధుల విషయంలో కూడా కేంద్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్న బీజేపీ నేతలను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్నారు.

వరదల సమయంలో కేంద్రం నుండి తెలంగాణాకు ఒక్కరూపాయి సాయం కూడా అందలేదు: కేటీఆర్
తాజాగా హైదరాబాద్ నగరంలో వర్షాలు వరదల కారణంగా ముంపు తలెత్తుతుందని, వరద ముంపుకు గురి కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేటీఆర్ వెల్లడించారు. వరద ముంపు శాశ్వత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరదల సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు.

మంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్.. నగరం నడిబొడ్డున సన్మానం చేస్తామంటూ
వరద ముంపు అంచనా వేయడానికి కేంద్రం నుండి వచ్చిన బృందం ఫోటోలు తీసుకుని వెళ్లిందని, ఇప్పటివరకు వరద నష్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పది వేల కోట్ల రూపాయలను తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఒకవేళ అలా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే నగరం నడిబొడ్డున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి పౌర సన్మానం చేస్తామంటూ కేటీఆర్ వెల్లడించారు. ఇంతకు ముందు అసెంబ్లీ సమావేశాలలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించి బీజేపీ సర్కార్ పై మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రానికి చేసింది శూన్యం అన్నారు కేటీఆర్. అది మంత్రి కిషన్ రెడ్డితో సాధ్యం కాదనే ఇలాంటి సవాళ్లు విసురుతున్నారని స్పష్టంగా అర్ధం అవుతుంది.


బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని చూపించే ప్రయత్నంలో కేటీఆర్
కేంద్రం
నుంచి
హైదరాబాద్
అభివృద్ధికి
ఎటువంటి
నిధులు
రావడంలేదని,
తెలంగాణ
ప్రభుత్వం
మాత్రమే
హైదరాబాద్
అభివృద్ధికి
కృషి
చేస్తుందని
చెప్పటం
లో
భాగంగా
మంత్రి
కేటీఆర్
పదే
పదే
కేంద్రాన్ని
టార్గెట్
చేస్తూ
విమర్శలు
గుప్పిస్తున్నారు.
బిజెపి
తెలంగాణ
రాష్ట్రానికి
అన్యాయం
చేసింది
అని
పదేపదే
చూపించే
ప్రయత్నం
చేస్తున్నారు.
అడుగడుగునా
కేంద్రంలోని
అధికార
బీజేపీని
టార్గెట్
చేస్తున్నారు.