వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రితో జాగ్రత్త: హీరో రానాకు కేటీఆర్ సూచన, కొడుకుకి కేసీఆర్ చాలా టఫ్పా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రముఖ నటుడు దగ్గుబాటి రానాకు ఓ సూచన చేశారు. తండ్రితో చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కష్టమేనని కేటీఆర్.. రానాకు సూచించారు.

కేటీఆర్, రానాల మధ్య సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ వేదికగా సంభాషణ జరుపుకున్నారు. రానా తన తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో ఓ సెల్ఫీని దిగారు. దానిని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దాని కింద ట్వీట్ చేశారు. తాను ఈ నిర్మాతతో పని చేస్తున్నానని, ఆయనే తన తండ్రి అని, త్వరలోనే మరిన్ని వివరాలు చెబుతానని పేర్కొన్నారు.

దానికి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారానే స్పందించారు. తాను రానాకు ఓ చిన్న సలహా ఇస్తున్నానని, తండ్రులు చాలా టఫ్ బాస్‌లు అని, ఏమాత్రం ఏమరుపాటుగా ఉండవద్దని ఓ హెచ్చరిక వంటి సలహా ఇచ్చారు. దానిపై రానా ప్రతిస్పందించారు. 'థ్యాంక్స్ సర్.. ఒప్పుకుంటున్నాను. అర్థం చేసుకుంటా'నని పేర్కొన్నారు.

కాగా, కేటీఆర్ తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. కేటీఆర్ కూడా రాజకీయాల్లో రాటుదేలారు. ఇటీవల తండ్రికి తగ్గ తనయుడిగా వెలుగులోకి వస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జీహెచ్ఎంసి ఎన్నికల్లో తెరాసను అద్భుత విజయం వరించేలా పార్టీని నడిపించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు తన తండ్రి చాలా టఫ్ బాస్ అని అర్థమై.. రానాకు సూచించినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

English summary
Minister KTR tweets about Actor Rana Suresh Babu film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X