మోడీ సర్కార్ పెట్రోల్ ధరల తగ్గింపు ఎలా ఉందంటే...ఆసక్తికర కథ చెప్పిన మంత్రి కేటీఆర్
పెట్రోల్, డీజిల్ మరియు వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై ఎనిమిది రూపాయలు, డీజిల్ పై ఆరు రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు ఊరట నిచ్చింది. అయితే కేంద్రం విపరీతంగా ధరలను పెంచి కొద్దిగా తగ్గించిందని టీఆర్ఎస్ మంత్రులు, నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది ఎవరు? ఇప్పుడు తగ్గించామని మోసం చేస్తుందెవరు?
దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుదలకు కారణమేంటి? దానికి బాధ్యులు ఎవరు? ముందుగా ధరలు పెంచింది ఎవరు? ఇప్పుడు తగ్గింపు పేరుతో ప్రజలను మోసం చేస్తుంది ఎవరు అంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఓఆసక్తికరమైన కథను కూడా చెప్పారు. నరేంద్ర మోడీ ప్రధాని కాకముందు, అయిన తరువాత క్రూడాయిల్ ధరలు తగ్గాయి కానీ పెరగలేదని, అయినా పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం ఎందుకు భారీగా పెరిగాయి అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్, అగ్రికల్చర్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ అన్నీ ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం విధించిన పెంపునకు బాధ్యత వహిస్తాయి అని కేటీఆర్ మండిపడ్డారు.

దేశంలో సెస్ రద్దు చేయబడితే, ఇంధన ధరలు 2014 స్థాయిలో ఉంటాయి: మంత్రి కేటీఆర్
ఎగువ నుండి వచ్చే ఆదాయాలు రాష్ట్రాలతో పంచుకోబడవు అంటూ కేంద్రం తీరును ఎండగట్టారు. అసలు దేశంలో సెస్ రద్దు చేయబడితే, ఇంధన ధరలు 2014 స్థాయిలో ఉంటాయి అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. మే 2014లో, ఇప్పుడు మే 2022లో ముడి చమురు ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి అయినప్పటికీ పెట్రోలు అప్పుడు లీటరుకు 70 రూపాయలు ఉంటే ఇప్పుడు 120 రూపాయలు ఉంది. ఎందుకు కారణం కేంద్రమే చెప్పాలి. ఇక అప్పటికీ ఇప్పటికీ తెలంగాణ వ్యాట్ మారదు. అయితే ధరల పెరుగుదలకు కారణమేమిటి ? ఎవరు బాధ్యత వహిస్తారు? అంటూ కేంద్రాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. ఇక ఇదే సమయంలో 2014 ఎన్నికలకు ముందు దేశంలో ధరల వివరాలను, ప్రస్తుతం దేశంలో ధరల వివరాలు పట్టికలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఆసక్తికర కథ చెప్పిన మంత్రి కేటీఆర్
అంతేకాదు ఓ కథ చెప్పిన కేటీఆర్ తన పాఠశాల పక్కన ఉన్న ఓ దుకాణదారుడు పీక్ సీజన్లో ధరలను 300% పెంచి, ఆపై ప్రజలను మోసం చేయడానికి, దానిని 30% తగ్గించే వాడు అంటూ పేర్కొన్నారు. ఆ దుకాణందారుడి సన్నిహితులు దానిని బంపర్ ఆఫర్‌గా అభివర్ణించడం ప్రారంభించి, అతనికి ధన్యవాదాలు తెలుపుతారు అంటూ బిజెపి నేతలను పరోక్షంగా టార్గెట్ చేశారు. ఇక దుకాణందారుడు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇక ఈ కథ తెలిసినట్టు అనిపిస్తుందా? అసలు ధరలు పెంచింది ఎవరు? అంటూ ప్రజలను ఆలోచించేలా చేశారు మంత్రి కేటీఆర్.

తెలంగాణాలో ఇంధన ధరల విషయంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
ఏది
ఏమైనా
పెట్రోల్,
డీజిల్
ధరల
పెంపుపై,
తాజాగా
కేంద్రం
తగ్గించిన
తీరుపై
తెలంగాణ
రాష్ట్రంలో
అధికార
టీఆర్ఎస్
కు,
బీజేపీ
కి
మధ్య
ప్రచ్ఛన్న
యుద్ధం
కొనసాగుతుంది.
కేంద్రం
తీసుకున్న
నిర్ణయంతో
తెలంగాణ
బిజెపి
నేతలు
టిఆర్ఎస్
సర్కార్
ను
టార్గెట్
చేస్తూ
విమర్శలు
గుప్పిస్తున్నారు.
పెట్రోల్
పై
దేశంలోనే
తెలంగాణ
అత్యధికంగా
పన్నులు
వసూలు
చేస్తోందని
కేంద్ర
మంత్రి
కిషన్
రెడ్డి,
బిజెపి
రాష్ట్ర
అధ్యక్షుడు
బండి
సంజయ్
తెలంగాణ
ప్రభుత్వాన్ని
టార్గెట్
చేశారు.
ఇక
తాజాగా
కేంద్రం
చేసిన
తగ్గింపు
కంటితుడుపు
చర్య
అంటూ
మంత్రి
కేటీఆర్
కేంద్రం
తీరుపై
విరుచుకుపడ్డారు.