వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫార్మాసిటీని జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా గుర్తించండి.. కేంద్రానికి కేటీఆర్ లేఖ

|
Google Oneindia TeluguNews

ఫార్మాసిటీ మౌలిక వసతుల కల్పనకు ఆర్థికసాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కార్ కోరింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రదాన్‌కు లేఖ రాశారు. ఆర్థిక సాయం చేస్తే ఫార్మాసిటీ దశ మారుతోందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. దాదాపు 5.60 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు.

సహజ వాయువు సరఫరా చేయాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను మంత్రి కేటీఆర్ కోరారు. ఫార్మాసిటీలో మౌలిక వసతుల కోసం రూ.1318 కోట్లు కేటాయించాలని, సాంకేతిక సదుపాయల కోసం రూ2100 కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రులను కోరారు. ఫార్మాసిటీ ద్వారా రూ.64 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేఅవకాశం ఉందని కేటీఆర్ అంచనా వేశారు. దీంతో ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని కేటీఆర్ తెలిపారు. ప్రజల జీవన ప్రమాణస్థాయి మెరుగవుతుందని పేర్కొన్నారు. జీడీపీ పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేశారు.

minister ktr wrote letter to central govt for pharmacity

ఫార్మాసిటీ వల్ల దాదాపు 5.60 లక్షల మందికి ఉఫాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రుల దృష్టికి కేటీఆర్ తీసుకొచ్చారు. దీంతో రాష్ట్రంలోని యువత, సమీప ప్రాంతాల్లోని వారికి ఉపాధి లభిస్తోందని చెప్పారు. హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత ఫార్మా పార్క్‌గా ఆవిర్భవిస్తోందని తెలిపారు. అంతేకాదు ఫార్మాసిటీని జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని కోరారు.

English summary
telangana minister ktr wrote letter to central government for pharmacity. ktr ask to central govt to release funds on pharma city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X