హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉచితసేవగా 108: 'ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ లక్ష్యం' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహించేందుకు సర్కారు అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తోందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్‌తో కలిసి సచివాలయంలో గురువారం మంత్రి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆరోగ్య తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. 108 వాహనాల సంఖ్య పెంచడంతోపాటు వాటిని అధునాతనంగా తీర్చిదిద్ది ప్రజలకు మరింత మెరుగైన సేవలందించనున్నామని స్పష్టం చేశారు.

కొత్తగా 290 అంబులెన్స్‌లు: 'ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ లక్ష్యం'

కొత్తగా 290 అంబులెన్స్‌లు: 'ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ లక్ష్యం'

నెలఖారులోగా 145 కొత్త అత్యవసర సేవల(108) వాహనాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. 290 కొత్త అంబులెన్స్ వాహనాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి తసుకొచ్చే విధంగా కసరత్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

కొత్తగా 290 అంబులెన్స్‌లు: 'ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ లక్ష్యం'

కొత్తగా 290 అంబులెన్స్‌లు: 'ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ లక్ష్యం'

గురువారం ఆయన సచివాలయంలో 108 వాహనాలను పరిశీలించారు. కొత్తగా రూపొందించిన ఈ వాహనాల్లో అధునాతన లైఫ్ సపోర్ట్ ఎక్విప్‌మెంట్‌ను అమర్చినట్లు పేర్కొన్నారు.

కొత్తగా 290 అంబులెన్స్‌లు: 'ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ లక్ష్యం'

కొత్తగా 290 అంబులెన్స్‌లు: 'ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ లక్ష్యం'

దీని ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 312 వాహనాలు ఉన్నాయన్నారు.

కొత్తగా 290 అంబులెన్స్‌లు: 'ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ లక్ష్యం'

కొత్తగా 290 అంబులెన్స్‌లు: 'ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ లక్ష్యం'

కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ బుద్ధప్రకాశ్, ఎన్‌హెచ్‌ఎం చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ శ్రీనివాస్‌రావు, యునిసెఫ్ ప్రతినిధి సంజీవ్ ఉపాధ్యాయ పాల్గొన్నారు.

English summary
Minister laxma reddy inaugurates new ambulances in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X