హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్ అవుతారు?: రోడ్డు పక్కన ఛాయ్ తాగుతున్నారా!, తనిఖీల్లో ఏం తేలిందంటే..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇంట్లో చేసుకున్న 'టీ' కంటే.. బయట ఛాయ్ బండి దగ్గర దొరికే ఛాయ్ కాస్త కలర్‌ఫుల్ గానే ఉంటుంది. చిక్కదనం సంగతేమో కానీ ఛాయ్ రంగు మాత్రం చూడగానే తాగేయాలనిపించేలా ఉంటుంది.

దీనికి కారణం.. వాళ్లు వాడే స్పెషల్ టీ పౌడర్ అనుకుంటే పొరపాటే. అదేమి కాదు.. రంగు కలిపిన ఛాయ్ పత్తా వాడటం వల్లే 'టీ' అలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తాజా తనిఖీల్లో ఈ విషయాలు వెలుగుచూశాయి.

Minister Laxma Reddy Inspects hotels and small shops in narayanaguda

నారాయణగూడలోని పలు హోటళ్లు, బేకరీలు, టిఫిన్‌ సెంటర్లు, కిరాణా దుకాణాలు, టీ షాపులు, మిర్చీ బండిల వద్ద మంత్రి లక్ష్మారెడ్డి శుక్రవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు షాపుల్లోని ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు.

నాణ్యతను పరిశీలించేందుకు మొబైల్‌ ఫుడ్‌సేఫ్టీ వాహనాన్ని కూడా తనిఖీలకు తీసుకువచ్చారు. పలు షాపుల్లో అక్కడికక్కడే ఆహార పదార్థాలు, వంట నూనె, మంచినీళ్లను పరిశీలించి తనిఖీ చేయించారు.

కొన్ని ఛాయ్ బండ్ల వద్ద వాడుతున్న ఛాయ్ పత్తాలో రంగులు కలుపుతున్నట్టు మంత్రి లక్ష్మారెడ్డి తనిఖీల్లో గుర్తించారు. దీంతో ఛాయ్ పత్తా ఎక్కడినుంచి కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంపై అధికారులను మరిన్ని వివరాలు సేకరించాల్సిందిగా ఆదేశించారు. కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

English summary
Telangana Health Minister Laxma Reddy has inspected hotels and tea shops in Narayanaguda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X