పువ్వాడ అజయ్ వేధింపులే: మరణానికి ముందు సాయి గణేష్, మంత్రిపై హత్య కేసు పెట్టాలన్న బండి
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య కేసు సంచలనంగా మారింది. నిత్యం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ.. సోషల్‌మీడియాలోనూ ప్రభుత్వ విధానాలపై పోస్టులు పెడుతుంటాడు సాయి గణేష్. వచ్చే నెల 4వ తేదీన పెళ్లి జరగాల్సి ఉండగా, ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో పొందుతూ మృతి చెందాడు. సాయి గణేష్ చనిపోవడంతో.. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులతోనే సాయి గణేష్ ఆత్మహత్య
మంత్రి పువ్వాడ అజయ్ ప్రోద్బలంతోనే పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ సాయి గణేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల సమక్షంలోనే స్టేషన్లో పురుగు మందు తాగడంతో.. అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. వెంటనే పోలీసులుప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మాట్లాడిన సాయి గణేష్.. తాను ఆత్మహత్య యత్నం చేయడానికి కారణాలను వివరించారు. మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులతోనే పురుగుల మందు తాగినట్టు సాయిగణేష్ చెప్పాడు. మంత్రి ఆగడాలు ఎక్కవయ్యాయని... పోలీసులను గుప్పిట్లో పెట్టుకొని తనను టార్చర్ పెట్టాడని వాపోయాడు. ఆ టార్చర్ తట్టుకోలేకే ఆత్మహత్య యత్నం చేశానన్నాడు.
సాయి గణేష్‌పై 16 కేసులు, రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు
కాగా,
ఆ
తర్వాత,
సాయి
గణేష్
పరిస్థితి
విషమంగా
మారడంతో
బీజేపీ
నేతలు..
హైదరాబాద్‌లోని
యశోదా
ఆస్పత్రికి
తరలించారు.
అక్కడే
చికిత్స
పొందుతూ
సాయి
గణేష్
మృతి
చెందాడు.
సాయిగణేష్‌పై
ఒకటి
కాదు..
రెండు
కాదు..
ఏకంగా
16
కేసులు
పెట్టారు
పోలీసులు.
అంతేగాక,
పీడీ
యాక్ట్
నమోదు
చేసి
రౌడీ
షీట్
ఓపెన్
చేశారు.
సాధారణంగా
దోపిడీలు,
హత్యలు
చేసేవాళ్లు,
పదే
పదే
నేరాలకు
పాల్పడేవారిపై
మాత్రమే..
పీడీ
యాక్ట్,
రౌడీ
షీట్
ఓపెన్
చేస్తారు.
కానీ,
బీజేపీ
కార్యకర్త
అయిన
సాయిగణేష్‌పై
పోలీసులు
ఎందుకు
ఇలాంటివి
నమోదు
చేశారన్నది
వివాదంగా
మారింది.
ఇదంతా
మంత్రి
పువ్వాడ
అజయ్
కుమార్
ప్రమేయంతోనే
జరిగిందని
బీజేపీ
నేతలు,
కార్యకర్తలు
ఆరోపిస్తున్నారు.

మంత్రి పువ్వాడ అజయ్, పోలీసుల తీరుపై బీజేపీ ఆగ్రహం.. ఉద్రిక్తత
హైదరాబాద్ నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆస్పపత్రికి... సాయి గణేష్ మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. పోస్టుమార్టం పూర్తయ్యేంత వరకూ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోస్టు మార్టం ఆలస్యం కావడంతో... బీజేపీ కార్యకర్తల్లో అసహనం పెరిగిపోయింది. దీంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మంత్రి పువ్వాడతో పాటు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. రోడ్డెక్కి టీఆర్ఎస్, పువ్వాడ ప్లెక్సీలను చించివేశారు. ఆస్పపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగానే పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య సాయి గణేష్ అంతిమయాత్ర నిర్వహించారు బీజేపీ కార్యకర్తలు . యాత్ర జరుగుతున్న సమయంలో కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు తరలిరావడంతో మళ్లీ ఉద్రిక్త వాతావరణం తలపించింది. టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు రాకుండా అడుగడుగునా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. శనివారం సాయంత్రం 6 గంటలకు సాయి గణేష్ అంతిమయాత్ర ముగిసింది. సాయి గణేష్ ఆత్మహత్యకు కారణమైన పువ్వాడ అజయ్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ఆయనను వదిలిపెట్టేది లేదని చెబుతున్నారు.

పువ్వాడ అజయ్, పోలీసులపై హత్య కేసు పెట్టాలన్న బండి సంజయ్
సాయి గణేష్ ఆత్మహత్య ఘటనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. మంత్రి పువ్వాడ, బాధ్యులైన పోలీసులు, నాయకులపై హత్య కేసు నమోదు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేయకపోవడం సిగ్గు చేటన్నారు. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలవల్లే కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం తెగించి కొట్లాడే కార్యకర్త సాయి గణేష్ అని అన్నారు బండి సంజయ్. చట్టానికి లోబడి పాలకుల అక్రమాలు, దుర్మార్గాలపై న్యాయ బద్ధంగా యుద్ధం చేసిన యువకుడు గణేష్.. అలాంటి యువకుడు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. సాయిగణేష్ పోరాటం మరువలేనిది., టీఆర్ఎస్ నేతలు గూండాయిజానికి పోలీసుల కండకావరానికి సాయి గణేష్ బలైపోయారన్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

సాయి గణేష్ పెళ్లికి రావాలని ఫోన్ చేశాడు.. అంతలోనే..: బండి సంజయ్
సాయి గణేష్ నిరుపేద సామాన్య కార్యకర్త, తల్లిని పోషిస్తూ కష్టపడి పనిచేస్తున్న యువకుడు. సాయి గణేష్ మరో పేద అమ్మాయితో వివాహానికి నిశ్చితార్థం కూడా జరిగిందన్నారు బండి సంజయ్. పెళ్లికి రమ్మంటూ నాకూ ఫోన్ చేసి ఆహ్వానించారు. ఇంతలోనే ఈ దారుణం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు బండి సంజయ్. టీఆర్ఎస్ నేతలు, జిల్లా మంత్రి.. బీజేపీని చూసి భయపడుతున్నారన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, బీజేపీ అధికారంలోకి వచ్చాక బాధ్యులను వదిలిపెట్టబోమని బండి సంజయ్ హెచ్చరించారు. మంత్రి పువ్వాడపై హత్య కేసు నమోదు చేయాలని, మిగిలిన నాయకులు, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.