జనగామ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జిల్లాల ఎఫెక్ట్: మినిస్టర్ చందులాల్ కంటతడి, మంత్రివై ఇలాగా.. కేసీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుట సోమవారం నాడు కంటతడి పెట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటులో ములుగుకు అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో మరో 21 కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. పాతవి పది జిల్లాలతో కలిపి మొత్తం 31 జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. గతంలో ప్రకటించిన పదిహేడు జిల్లాలతో పాటు.. ప్రజల డిమాండు మేరకు జనగామ, సిరిసిల్ల, గద్వాల్ జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అసీఫాబాద్‌ను జిల్లాగా చేయాలని తాజాగా సోమవారం నిర్ణయించారు.

ఎన్టీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించా, కానీ: కేసీఆర్, నయీం పైనా స్పందనచాలా రోజులుగా ములుగును కూడా జిల్లాగా చేయాలని డిమాండ్లు, అందోళనలు జరుగుతున్నాయి. జనగామ, సిరిసిల్లల మాదిరిగానే ములుగు కోసం ఆందోళనలు జరిగాయి. అయితే ములుగును మాత్రం జిల్లాగా ప్రకటించలేదు. దీంతో చందులాల్ కంటతడి పెట్టారు.

కొత్త జిల్లాల ఏర్పాటులో తమ నియోజకవర్గమైన ములుగుకు అన్యాయం జరిగిందని ఆయన ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు. వరంగల్‌ జిల్లా పునర్య్వవస్థీకరణపై సోమవారం జరిగిన సమీక్షలో ఆ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్‌ తదితర నేతలు పాల్గొన్నారు.

జిల్లా విభజన గురించి చర్చిస్తున్నప్పుడు చందూలాల్‌ మాట్లాడారు. ములుగుకు జిల్లా కేంద్రంగా అవకాశం వస్తుందని భావించామన్నారు. నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారని, జిల్లా కాకపోవడం బాధాకరమని ఆయన వాపోయారని సమాచారం.

Minister weeps infront of CM KCR!

సీఎం కేసీఆర్ స్పందిస్తూ భూపాలపల్లిని ఎంపిక చేసినప్పుడు ములుగుకు అవకాశం ఇవ్వడం సాధ్యం కాదన్నారు. మంత్రిగా ఉండి ఇలా డిమాండ్‌ చేయడం, బాధపడటం సరికాదన్నారని తెలుస్తోంది. ప్రజల కోణంలో ఆలోచించాలని, భూపాలపల్లికి సహకరించాలన్నారు.

తన ముందే తెరాస నేత, ఎంపీ వాగ్వాదం, ఇదేం తీరని కేసీఆర్ అసహనంతన ముందే తెరాస నేత, ఎంపీ వాగ్వాదం, ఇదేం తీరని కేసీఆర్ అసహనం

ప్రత్యేక అభివృద్ధినిధి కింద నియోజకవర్గానికి రూ.వంద కోట్లు ఇస్తామని, ఐటీడీఏను బలోపేతం చేస్తామని, గిరిజనులను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ములుగు నియోజకవర్గంలోని మల్లంపల్లి వద్ద ఏర్పాటు చేయాలని స్పీకర్‌ మధుసూదనా చారి కోరారు. చందూలాల్‌ను ఇతర నేతలు సముదాయించినా సమావేశం ముగిసే వరకు ఆయన ముభావంగా ఉన్నారని తెలుస్తోంది.

English summary
Minister Ajmeera Chandulal weeps infront of Chief Minister K Chandrasekhar Rao on Monday!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X