వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రెండింటిలో ఏది.. కవిత భవిష్యత్తును కేసీఆర్‌ ఎలా డిసైడ్ చేయబోతున్నారు..

|
Google Oneindia TeluguNews

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో టీఆర్ఎస్‌లో ఎడతెగని చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో సంఖ్యా బలం రీత్యా.. తెలంగాణ కోటాలో ఖాళీ అయ్యే రెండు రాజ్యసభ స్థానాలు టీఆర్ఎస్‌కే దక్కనున్నాయి.అయితే ఈ రెండు స్థానాలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎవరికి కేటాయించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఎప్పటిలాగే తన నిర్ణయాన్ని కేసీఆర్ చివరి వరకు రివీల్ చేసేలా కనిపించట్లేదు.ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌ తరుపున ఆ రాజ్యసభ స్థానాలను దక్కించుకోబోయేది ఎవరన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా మాజీ ఎంపీ,కేసీఆర్ తనయ కవితకు ఇందులో స్థానం ఉంటుందా అన్నది మరింత ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.

మంత్రి పదవా..? రాజ్యసభా..?

మంత్రి పదవా..? రాజ్యసభా..?

గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత క్రియాశీలక రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల సమయంలోనూ ఆమె నిజామాబాద్‌లో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఫలితాలపై ఆ ఎఫెక్ట్ కనిపించింది. నాయకత్వ పటిమ కలిగిన కవిత యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటే టీఆర్ఎస్‌కు నష్టమని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరిగి ఆమెను యాక్టివ్ చేసేందుకు త్వరలోనే ఆమెకు పదవి కట్టబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అది మంత్రి పదవా.. రాజ్యసభ పదవా అన్నది సస్పెన్స్‌గా మారింది.

ఫెడరల్ ఫ్రంట్.. కవితను రాజ్యసభకు పంపే ఛాన్స్..

ఫెడరల్ ఫ్రంట్.. కవితను రాజ్యసభకు పంపే ఛాన్స్..

కవిత ఇదివరకు ఎంపీగా పనిచేసిన నేపథ్యంలో ఢిల్లీ స్థాయి రాజకీయ వర్గాలతో ఆమెకు సత్సంబంధాలు ఉన్నాయి. భాష విషయంలో ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంగ్లీష్,హిందీ,ఉర్దూ వంటి భాషలను అనర్గళంగా మాట్లాడగలదు కాబట్టి.. జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ వాణిని బలంగా వినిపించగలదు. పైగా కవిత ఢిల్లీ రాజకీయాల్లో ఉంటే.. భవిష్యత్తులో కేసీఆర్ ఏర్పాటు చేయబోయే ఫెడరల్ ఫ్రంట్‌కు కీలకంగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కవితను రాజ్యసభకు పంపించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే కేకే స్థానాన్ని ఆమెకు కట్టబెడుతారా.. లేక కేకేను కొనసాగిస్తూనే కవితను కూడా రాజ్యసభకు పంపిస్తారా అన్నది వేచి చూడాలి.

సీఎంగా కేటీఆర్.. మంత్రిగా కవిత..

సీఎంగా కేటీఆర్.. మంత్రిగా కవిత..

రాజ్యసభ పదవిని కవితకు కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో మరో ఆసక్తికర ప్రచారం కూడా తెర పైకి వచ్చింది. కవితను రాజ్యసభకు పంపించకుండా.. రాష్ట్ర రాజకీయాల్లోనే యాక్టివ్ చేసే అవకాశాలున్నాయనేది దాని సారాంశం. ఇందుకోసం కేసీఆర్ కవితకు మంత్రి పదవి కట్టబెట్టబోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది లోపు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న కేసీఆర్.. కేటీఆర్ కేబినెట్‌లో కవితను కూడా చేర్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కవితకు రాజ్యసభ సీటు కేటాయించకపోతే.. మంత్రి పదవి ఊహాగానాలకు బలం చేకూరవచ్చు.

Recommended Video

#HappyBirthdayKCR : Craze Ka Baap | Birthday Wishes Pour In For KCR | Oneindia Telugu
రాజ్యసభ కోసం పోటీపడుతున్న ఆశావహులు..

రాజ్యసభ కోసం పోటీపడుతున్న ఆశావహులు..

రాజ్యసభ సీటు విషయంలో టీఆర్ఎస్‌లో ఆశావహుల సంఖ్య ఎక్కువ గానే ఉంది. కేకే మరోసారి తనకే రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను ఢిల్లీ స్థాయిలో సమన్వయం చేయాలంటే తనలాంటి సీనియర్ రాజ్యసభలో ఉండటం అవసరం అని ఆయన భావిస్తున్నారు. అయితే వయసు రీత్యా కేసీఆర్ ఆయన్ను పక్కనపెడుతారా.. లేక సీనియారిటీ రీత్యా మళ్లీ ఆయన వైపే మొగ్గుచూపుతారా అన్నది వేచి చూడాలి. ఇక మరో సీటు కోసం మాజీ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డితో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపీ మందా జగన్నాథం,మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు.

English summary
Now the big question in Telangana political circles is will kcr send Kavitha to Rajya Sabha or will give ministry to her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X