నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దారుణం: ఫోటోలతో బ్లాక్‌మెయిల్, రేప్ చేస్తూ సెల్ఫీ వీడియో, ఫ్రెండ్స్‌కు వాట్సాప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: పదో తరగతి విద్యార్థినిని అత్యాచారం చేస్తూ సెల్ఫీ తీసిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. అంతేకాదు, దానిని అతను తన స్నేహితులకు కూడా వాట్సాప్‌లో షేర్ చేశాడు. దానిని చూపిస్తూ ఆరు నెలలుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు, నిందితుడు ఇద్దరూ మైనర్లే. తండ్రికి రెండు రోజుల క్రితం అనుమానం రావడంతో విషయం వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెంత్ క్లాస్ చదువుతున్న పదిహేనేళ్ల బాలికకు ఇంటి పక్కనే ఇంటర్ రెండో సంవత్సరం పూర్తయిన విద్యార్థి (17) స్నేహం ఏర్పడింది. ఆర్నెళ్ల క్రితం బాలిక పుట్టిన రోజు కాగా బాలుడు తన స్నేహితులతో కలిసి ఆమెను బయటకు తీసుకు వెళ్లాడు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో కేక్ కట్ చేశారు. ఆ తర్వాత ఇంటికి వచ్చారు.

నిర్మానుష్య ప్రాంతంలో బర్త్ డే

నిర్మానుష్య ప్రాంతంలో బర్త్ డే

అయితే, నిర్మానుష్య ప్రాంతాల్లో బర్త్ డేకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూపించి ఆ బాలుడు.. బాలికను బ్లాక్ మెయిల్ చేశాడు. ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో తరుచూ వెళ్లి లొంగదీసుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. చిత్రాలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు. అతడి బెదిరింపులకు ఆమె లొంగింది.

అత్యాచారం చేసి సెల్ఫీ వీడియో

అత్యాచారం చేసి సెల్ఫీ వీడియో

ఆ తర్వాత బాలికతో కలిసి సెల్ఫీ చిత్రాలు తీసుకొని తన స్నేహితులకు షేర్‌ చేశాడు. రెండు నెలల క్రితం ఏప్రిల్‌ ఇరవై ఐదో తేదీన బాలిక ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించి ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో తన ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీశాడు. ఆ వీడియోను కూడా స్నేహితులకు పంపించాడు.

ఫోన్‌తో వెలుగు చూసిన విషయం

ఫోన్‌తో వెలుగు చూసిన విషయం

బాలిక తండ్రి మొబైల్ ఇటీవల చోరీకి గురైంది. దీంతో ఇంట్లోని పాత ఫోన్ వాడుతున్నాడు. శుక్రవారం సాయంత్రం ఈ నెంబర్‌కు ఆ బాలుడు పలుమార్లు ఫోన్ చేశాడు. బాలిక తండ్రికి అనుమానం వచ్చి కూతురును గట్టిగా అడగడంతో అసలు విషయం తెలిసింది. బాలుడ్ని పిలిపించి అందులోని ఫోటోలు, వీడియోలు తొలగించాలని సూచించాడు. కానీ బాలుడు నిరాకరించాడు.

అప్పుడు చిత్రాలు, వీడియోలు బయటపడ్డాయి

అప్పుడు చిత్రాలు, వీడియోలు బయటపడ్డాయి

దీంతో ఆ తండ్రి అతని నుంచి ఆ ఫోన్‌ను తీసుకుని, ఓ దుకాణానికి తీసుకెళ్లి అన్‌లాక్‌ చేయించగా, అందులోని చిత్రాలు, వీడియోలను చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి ఫోన్లో లభించిన చిత్రాలు, వీడియోలు పోలీసులకు అందించారు. ఫోన్ సీజ్ చేసిన పోలీసులు బాలుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

English summary
Minor Girl Raped by Neighbour in Nizamabad District. Police arrested minor accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X