హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరోసారి ఉలిక్కిపడ్డ రమ్య కుటుంబం: బైక్‌తో పిన్ని కారును ఢీకొన్న మైనర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యువకుల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా చిన్నారి రమ్యతోపాటు ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబానికి తాజాగా చోటు చేసుకున్న ఘటన వారిని మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. ఈ యేడాది జులై 1న యువకుల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్య, బాబాయ్ రాజేశ్, తాతయ్య చనిపోరుున విషయం తెలిసిందే.

ఆ ప్రమాదంలో చనిపోరుున రాజేశ్ భార్య(రమ్య పిన్ని) శిల్ప.. తన అక్కా, బావతో కలసి మంగళవారం కాప్రా నుంచి నల్గొండకు కారులో బయల్దేరారు. కాగా, బైక్‌పై రాష్ డ్రైవింగ్‌తో దూసుకువచ్చిన ఓ మైనర్ వారి కారును ఢీ కొట్టాడు. దీంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పంజాగుట్ట ప్రమాద ఘటన మర్చిపోకముందే... ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో శిల్ప ప్రమాదంతో షాక్‌కు గురయ్యారు.

ramya

కుషారుుగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో బైక్ నడుపుతున్న బాలునికి స్పల్ప గాయాలయ్యాయి. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ అశోక్ తెలిపారు.

ramya pinni

ఘటన అనంతరం రమ్య పిన్ని శిల్ప మీడియాతో మాట్లాడుతూ.. మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ వల్ల తమ కుటుంబంలో చోటు చేసుకున్న మూడు మరణాల విషాదం నుంచి ఇప్పటికీ తామంతా బయటికి రాలేకపోతున్నామని, ఆ షాక్ నుంచి తేరుకోలేక ఇంట్లోనే ఉంటున్నామని చెప్పారు.

ఆ తల్లికి గుండెకోత: కారుపై పడిన కారు, 9రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన రమ్య ఆ తల్లికి గుండెకోత: కారుపై పడిన కారు, 9రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన రమ్య

ఎంతకాలం ఇలా కుమిలిపోతావని అక్కా, బావ తనను బలవంతంగా ఒప్పించి బయటకు తీసుకెళ్తున్న క్రమంలో తిరిగి ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదం జరగడం తమను భయాందోళనకు గురిచేసిందని చెప్పారు. బాధ్యత మరిచి తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇస్తుండటం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఇప్పటికైనా, అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉండి.. తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఇతర కుటుంబాలకు జరగకుండా చూడాలని ఆమె కోరారు.

English summary
Minors who were travelling on Bike have hit Panjagutta Car accident victim Ramya's family car at Saket Township in Hyderabad. Ramya's Aunt expressed her anger on the parents of minors for allowing them to have bike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X