• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏ పరీక్షకైనా సిద్దం-రాహుల్ రెడీనా :లై డిటెక్టర్ కు వస్తా-కేసీఆర్ రావాలి :కేటీఆర్ వర్సెస్ రేవంత్ సవాళ్ల హీట్..

By Chaitanya
|

టాలీవుడ్ ను షేక్ చేసిన డ్రగ్స్ వ్యవహారం...ఇప్పుడు రాజకీయంగా ఆరోపణలు..ప్రత్యారోపణలతో వేడి పెంచుతోంది. మంత్రి కేటీఆర్.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఇద్దరిలో ఏ ఒక్కరూ తగ్గటం లేదు. సవాళ్లకు ప్రతి సవాళ్లు చేస్తున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ పైన గజ్వేల్ సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసారు. దీని పైన కేటీఆర్ స్పందించారు. ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. తాను ఏ పరీక్షకు అయినా సిద్దమని స్పష్టం చేసారు.

తాను పరీక్షలకు సిద్ధమని.. రాహుల్‌ గాంధీ రెడీనా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో కేటీఆర్‌ సోమవారం ట్విటర్‌ వేదికగా రేవంత్‌ వ్యాఖ్యలపై స్పందించారు. కేటీఆర్ తన ట్వీట్ లో ''ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏ రకమైన పరీక్షకైనా నేను సిద్ధమే.. రాహుల్‌ వస్తాడా. చర్లపల్లి బ్యాచ్‌తో నేను టెస్టులు చేసుకుంటే నా గౌరవం తగ్గుతుంది. నాకు క్లీన్‌చిట్‌ వస్తే పదవికి రాజీనామా చేసి రేవంత్‌ క్షమాపణ చెప్తాడా.. ఓటుకు నోట్ల కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా'' అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Minster KTR and TPCC Chief Revanth challenges war creating politial heat in Telangana

ఇక, రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ మధ్నాహ్నం గంటలకు అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తానని..అటు నుంచి ఏ ఆసుపత్రి అంటే ఆ హాస్పిటల్‌లో డ్రగ్స్‌ టెస్ట్ చేసుకుందాం అన్నారు. కేసు నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి మంత్రి కేటీఆర్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి వైట్‌ ఛాలెంజ్‌ విసిరారు. డ్రగ్స్‌ టెస్ట్ చేసుకోవడానికి కేటీఆర్‌, విశ్వేశ్వర్‌ రెడ్డి సిద్ధం కావాలన్నారు. డ్రగ్స్‌ టెస్ట్‌ చేసుకుని యువతకు ఆదర్శంగా నిలువాలని పిలుపునిచ్చారు. ఇక, రేవంత్ చేసిన వ్యాఖ్యల పైన మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా దాఖలు చేసారు.

ఇదే విషయాన్ని కేటీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దోషులకు శిక్ష తప్పదని స్పష్టం చేసారు. కేటీఆర్ చేసిన ట్వీట్ కు రేవంత్ స్పందించారు. తాను లై డిటెక్టర్ పరీక్షలకు సిద్దమని రేవంత్ తేల్చి చెప్పారు. అయితే, సహారా - ఈఎస్ఐ వ్యవహారాల్లో కేసీఆర్ సైతం తనతో పాటుగా లై డిటెక్టర్ పరీక్షలకు రావాలని కండీషన్ పెట్టారు. కేటీఆర్ తాను చర్లపల్లి జైలుకు వెళ్లి వచ్చిన వారితో కాదని.. రాహుల్ తో సవాల్ కు సిద్దమని స్పష్టం చేసారు. దీంతో..ఈ సవాళ్ల పర్వం రెండు పార్టీల శ్రేణుల్లోనూ ఆసక్తి కరంగా మారింది.

  KTR ప్రూఫ్ Revanth Reddy డ్యామేజ్ కంట్రోల్ Shashi Tharoor కి సారీ.. జరిగిందీ ఇదీ!! | Oneindia Telugu

  ఇక, రేవంత్ ముందుగా చెప్పిన విధంగా ఈ మధ్నాహ్నం అమరవీరుల స్థూపం వద్దకు వస్తారని చెబుతున్నాు. ఇప్పటికే పార్టీ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. రేవంత్ పైన కేటీఆర్ కోర్టుకు వెళ్లటం మరో ఆసక్తి కర అంశం. ఇక, ఇప్పుడు రేవంత్ ఈ సవాళ్ల పైన ఏ రకంగా వ్యవహరిస్తారు..అమర వీరుల స్థూపం వద్దకు వస్తారా..ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. రేవంత్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సీఎం కేసీఆర్ - కేటీఆర్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ పైన చేస్తున్న దూషణల పైనా కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. ఒక ఇటువంటివి ఉపేక్షించేది లేదని కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు.

  English summary
  Minster KTR and TPCC Chief Revanth challenges war creating politial heat in Telangaana. Both leaders challenging through tweets.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X