వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ చిన్నారికి సాయం చేయండి: వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. ప్రజల సమస్యల పట్ల వెంటనే స్పందించే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. కంటి సమస్యతో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిన్నారి కంటి ఆపరేషన్‌కు ఆర్థిక సాయం చేసి ఆమె కంటి చూపు రావడానికి కారణమయ్యారు.

ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ చిన్నారి కంటిచూపు సమస్యతో బాధపడుతోంది. చికిత్స చేయించేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆమె కుటుంబసభ్యులో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కూడా పనిచేయకపోవడంతో వారు దిక్కుతోచని పరిస్థితులో ఉన్నారు.

ఈ నేపథ్యంలో భరత్ అనే ఓ నెటిజన్ ఆ చిన్నారి సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి ట్విట్టర్ ద్వారా తీసుకెళ్లారు. బాధితులు ఏపీకి చెందిన వారని, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో పనిచేయడం లేదంటూ సమస్యను ఆయనకు వివరించారు.
ఆమె చికిత్స అందేలా సిఫారసు చేయాలని కోరారు.

భరత్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్.. ఆ చిన్నారి చికిత్సకు సహకరిస్తామని చెప్పారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి ఆదుకుంటామని చెప్పారు. హామీ ఇచ్చినట్లుగానే ఆ చిన్నారి చూపు మెరుగుపడేందుకు సహకరించారు.

English summary
Telangana Minster Taraka Rama Rao Helped to a baby, belongs to Andhra Pradesh state, eye treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X