వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాంజానియాలో హైదరాబాద్ ఇంజనీర్ మిస్సింగ్: సరస్సులో మునిగి..

'దీన్నిబట్టి సరస్సులో మొసళ్లు ఉన్నాయన్న సంగతి తెలిసింది. ఇప్పటికైతే జనార్దన్ రెడ్డి గురించి ఎలాంటి సమాచారం లేదు. గజ ఈతగాళ్లతో సరస్సులో జనార్దన్ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి' అని తెలంగాణ సచివాలయ వ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ కు చెందిన ఓ ఇంజనీర్ టాంజానియాలో అదృశ్యమైన కేసులో పురోగతి లభించింది. విక్టోరియా సమీపంలో ఉన్న ఓ సరస్సులో స్విమ్మింగ్ కోసం వెళ్లి గల్లంతైపోయాడు. ఇండియన్ హైకమిషన్ ఆదేశాల మేరకు అక్కడి ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మురం చేయగా.. సదరు ఇంజనీర్ మిస్సింగ్ మిస్టరీ వీడింది.

అదృశ్యమైన వ్యక్తిని 35ఏళ్ల అలుగుబెల్లి జనార్ధన్ రెడ్డిగా గుర్తించారు. టాంజానియాలోని గీటా గోల్డ్ మైన్స్ లో అతను ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం టాంజానియా వెళ్లిన అతను కుటుంబంతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు.

ఘటన జరిగిన జనవరి 21వ తేదీ జనార్దన్, అతని ఉద్యోగ సహచరులతో కలిసి రుబోండో ఐస్ లాండ్ లో ఉన్న సరస్సు వద్దకు వెళ్లాడు.

'అక్కడికెళ్లాక.. స్విమ్మింగ్ కోసం ముగ్గురు సరస్సులో దూకారు. ముందు సహచర ఉద్యోగులు సరస్సులో దూకగా.. చివరగా జనార్దన్ అందులో దూకాడు. జనార్థన్ దూకిన వెంటనే ఒక్కసారిగా బురద మొత్తం పైకి ఎగజిమ్మింది. ఆ తర్వాత 'నో' అని జనార్దన్ పెద్దగా అరవడం వినిపించింది. అంతే.. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం'

Missing Hyderabad engineer drowns in Tanzania, efforts on to trace him

'దీన్నిబట్టి సరస్సులో మొసళ్లు ఉన్నాయన్న సంగతి తెలిసింది. ఇప్పటికైతే జనార్దన్ రెడ్డి గురించి ఎలాంటి సమాచారం లేదు. గజ ఈతగాళ్లతో సరస్సులో జనార్దన్ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి' అని తెలంగాణ సచివాలయ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి.

జనార్దన్ రెడ్డి గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాల్సిందిగా కోరుతూ అతని తండ్రి రాఘవ రెడ్డి హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జను సంప్రదించారు. కొడుకు అదృశ్యమయ్యాడన్న వార్త తెలియగానే.. తొలుత జనార్దన్ పనిచేస్తున్న కంపెనీకి ఫోన్ చేసి సహాయం చేయాల్సిందిగా రాఘవరెడ్డి కోరారు. అయితే కంపెనీ నుంచి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

'తెలంగాణ ప్రభుత్వాన్ని నేను అర్థిస్తున్నాను. టాంజానియా అధికారులతో సంప్రదింపులు జరిపి గాలింపు చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా కోరుతున్నాను' అని రాఘవరెడ్డి వెల్లడించారు. మంత్రి కేటీఆర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా ఆయన విదేశాంగ సహాయం కోరారు.

కాగా, జనార్దన్ రెడ్డి స్వగ్రామం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి. గచ్చిబౌలిలోని ఖాజాగూడాలో వారు ప్రస్తుతం నివాసముంటున్నారు. సహచరులతో కలిసి బయటకు వెళ్లే గంట ముందు చివరిసారిగా జనార్దన్ రెడ్డి తన తండ్రికి ఫోన్ చేశారు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు సరస్సులో మునిగిపోవడంతో.. అతని ఆచూకీ కోసం ఇప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

English summary
After a missing engineer from Hyderabad was found to have drowned in Lake Victoria in Tanzania, the Indian High Commission there has contacted local government officials to speed up search operations to locate him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X