• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కాసుల కోసం నిఖిల్ కాళ్లు కోశారు: ఆపరేషన్ ఇలా, సంక్లిష్ట ప్రక్రియ (పిక్చర్స్)

By Srinivas
|

హైదరాబాద్: లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం తీవ్ర విమర్శలకు దారి తీసింది. నిఖిల్ రెడ్డి అనే యువకుడికి ఎత్తు పెంచుతామంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఆపరేషన్ నిర్వహించిన ఘటన కలకలం రేపుతోంది.

కాసుల కోసం కక్కుర్తిపడిన వైద్యులు.. ప్రమాదంలో కాలు విరిగిన సందర్భంలోనో, క్యాన్సర్‌ వంటి వ్యాధులతో ఎముకలను తొలగించాల్సి వచ్చినప్పుడో చేయాల్సిన శస్త్రచికిత్సను ఎత్తు పెంచాలని కోరిన నిఖిల్ రెడ్డికి చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శస్త్ర చికిత్స చేశారిలా...

మూడు అంగుళాల ఎత్తు పెంచేందుకు నిఖిల్‌ మోకాళ్ల కింద రెండు చోట్లా గాట్లు పెట్టి కాళ్ల ఎముకలను కట్‌ చేసి, మధ్యలో ఇనుపరాడ్లను బిగించి శస్త్రచికిత్స పూర్తి చేశారు. క్రమంగా అక్కడ ఎముక వృద్ధి చెందుతుందని, తద్వారా ఎత్తు పెరగవచ్చని శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు నిఖిల్‌కు వివరించినట్టుగా తెలుస్తోంది.

కాగా, ఈ చికిత్స పైన వైద్య నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. కాళ్లను కోసి, ఎత్తు పెంచే ఈ విధానాన్ని ఇల్‌జర్వ్‌‌గా వ్యవహరిస్తుంటారని, ఇది రష్యన్‌ చికిత్స విధానమని, ప్రమాదాల్లో కాలుకు తీవ్రంగా దెబ్బతగిలి, విరిగిన సందర్బాల్లో మాత్రమే ఈ చికిత్సలో ఎముకల పొడవును పెంచి పూర్వపు రూపాన్ని తీసుకొస్తారని అంటున్నారు. ఇది ఎంతో సంక్లిష్టతతో కూడుకున్న ప్రక్రియ.

వైద్యుల నిర్వాకం

వైద్యుల నిర్వాకం

నగరంలోని గ్లోబల్ ఆసుపత్రి నిర్వాకం ఒకటి వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఎత్తు పెంచుతామంటూ ఓ యువకుడి వద్ద లక్షల్లో వసూలు చేశారు. వివరాల ప్రకారం సికింద్రాబాద్‌లోని సుచిత్రా ప్రాంతానికి చెందిన నిఖిల్ రెడ్డి (22) అనే యువకుడు 5.7 ఎత్తు ఉన్నాడు.

వైద్యుల నిర్వాకం

వైద్యుల నిర్వాకం

ఇంకా ఎత్తు పెరగడానికి గ్లోబల్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించాడు. మూడు ఇంచులు పెరిగేందుకు కాళ్లలో రాడ్లు వేసి హైట్ పెంచుతామని డాక్టర్లు చెప్పారు. ఆసుపత్రి యజమాన్యం రూ.7 లక్షలు ఖర్చు అవుతుందంటూ అతని నుంచి రూ.4 లక్షలు డబ్బులు తీసుకుని, తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంగళవారం ఉదయం ఆపరేషన్ చేశారు.

వైద్యుల నిర్వాకం

వైద్యుల నిర్వాకం

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆపరేషన్ చేశారు. దీంతో నిఖిల్ రెడ్డి మూడు రోజుల క్రితం తన బంధువుతో కలిసి వచ్చి గ్లోబల్ ఆసుపత్రిలో చేరాడు. అయితే తమ కుమారుడు మూడు రోజుల నుంచి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

వైద్యుల నిర్వాకం

వైద్యుల నిర్వాకం

దీంతో అతని ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు, యువకుడు గ్లోబల్ ఆసుపత్రిలో ఉన్నట్టు తేల్చారు. దీంతో తమ కుమారుడికి ఏమైందో అన్న ఆందోళనతో హుటాహుటిన గ్లోబల్ ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులకు అక్కడి వైద్యులు దిమ్మదిరిగే సమాధానం చెప్పారు.

- వైద్యుల నిర్వాకం

- వైద్యుల నిర్వాకం

మీ కుమారుడి రెండు కాళ్లు కత్తిరించామని, కాళ్లలో రాడ్లు వేసి అతని ఎత్తు పెంచుతామని చెప్పారు. సుమారు 7 గంటల పాటు ఈ సర్జరీ చేశామని వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులకు ఆగ్రహాంతో ఆసుపత్రి వైద్యులపై మండిపడ్డారు. తమ కుమారుడి దయనీయ పరిస్థితిని చూసి నోట మాటరాలేదు. పేరంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.

వైద్యుల నిర్వాకం

వైద్యుల నిర్వాకం

మరోవైపు, నిబంధనలకు విరుద్ధంగా శస్త్ర చికిత్స చేశారని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శిబాజీ చటోపాధ్యాయ తెలిపారు.

వైద్యుల వివరణ

వైద్యుల వివరణ

ఏ ఆపరేషన్ అయినా దానిని చేయించుకునే వ్యక్తి సంతకం ఉంటే చేయడం మెడికల్ కౌన్సెల్ నిబంధన ప్రకారం సమ్మతమేనని చెప్పారు.

ఎప్పుడంటే అప్పుడు చేసేందుకు కాదని, కేవలం డబ్బులు గుంజడానికి పొడవును పెంచుతామని చికిత్స చేస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కొన్నిసార్లు ఎముకల ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడి నడవడానికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఒకవేళ తన శరీరాకృతి మార్చుకునేందుకు ఈ చికిత్స కోసం స్వయంగా ముందుకు వచ్చినా సరే వైద్యులు వారికి కౌన్సెలింగ్‌ చేసి వద్దనే చెబుతారని, కానీ ఇక్కడ కనీసం తల్లిదండ్రులకు సమాచారం లేకుండా డబ్బుల కోసం కక్కుర్తిపడి ఆసుపత్రి వైద్యులు వ్యవహరించిన తీరు వైద్యవర్గాల్లో తీవ్ర విస్మయం కలిగిస్తోందని అంటున్నారు.

నిఖిల్ పరిస్థితి విషమం

గ్లోబల్ ఆసుపత్రిలో ఉన్న నిఖిల్ పరిస్థితి విషమంగా ఉందని, రెండు కాళ్లకు తీవ్రంగా వాపు ఉందని తెలుస్తోంది. అతను కదల్లేని పరిస్థితిలో ఉన్నాడు. ఆసుపత్రిలో ఉన్న నిఖిల్‌ను చూసేందుకు ఆసుపత్రి సిబ్బంది తల్లిదండ్రులను అనుమతించడం లేదని తెలుస్తోంది.

English summary
Missing Nikhil Reddy found admitted in hospital for height increase surgery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X